Urfi Javed : సమంత చేస్తే కరెక్ట్.. నేను చేస్తే తప్పా??

సాధారణంగానే ఉర్ఫీ డ్రెస్సింగ్ స్టైల్ చాలా బోల్డ్ గా ఉంటుంది. తన సోషల్ మీడియాలో కూడా బోల్డ్ ఫోటోలని పోస్ట్ చేస్తూ ఉంటుంది. గతంలో కూడా ఉర్ఫీ డ్రెస్సింగ్ స్టైల్ పై ట్రోల్ చేశారు నెటిజన్లు.......

Urfi Javed : సమంత చేస్తే కరెక్ట్.. నేను చేస్తే తప్పా??

Samanth

Urfi Javed :  ఇటీవల సెలబ్రిటీలు ఏదైనా తప్పు చేస్తూ దొరికినా, లేదా మహిళా సెలబ్రిటీలు అయితే డ్రెస్సింగ్ సరిగ్గా లేకపోయినా సోషల్ మీడియాలో, మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది సెలబ్రిటీలు ఈ ట్రోల్స్ ని లైట్ గా తీసుకుంటే మరి కొంతమంది మాత్రం సీరియస్ గా తీసుకుంటున్నారు. ఆ ట్రోల్ల్స్ ని తిప్పి కొడుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి, హిందీ బిగ్‌బాస్‌ ఫేమ్ ఉర్ఫీ జావెద్‌ తనపై వచ్చిన ట్రోల్ల్స్ కి సీరియస్ గా స్పందించింది.

సాధారణంగానే ఉర్ఫీ డ్రెస్సింగ్ స్టైల్ చాలా బోల్డ్ గా ఉంటుంది. తన సోషల్ మీడియాలో కూడా బోల్డ్ ఫోటోలని పోస్ట్ చేస్తూ ఉంటుంది. గతంలో కూడా ఉర్ఫీ డ్రెస్సింగ్ స్టైల్ పై ట్రోల్ చేశారు నెటిజన్లు. తాజాగా ఓ పలుచని డ్రెస్ వేసుకున్న ఉర్ఫీపై ఆ డ్రెస్ ఏంటి అంటూ ట్రోల్ చేశారు. అయితే ఓ వెబ్ సైట్ ‘దోమల జాలి కంటే పలుచని డ్రెస్‌ వేసుకున్న ఉర్ఫీ స్టైల్‌ చాలా దరిద్రంగా ఉందని జనాలు తిడుతున్నారు’ అంటూ ఉర్ఫీ జావెద్‌ పై ఆర్టికల్ రాసింది. అయితే ఇదే వెబ్ సైట్ గతంలో ‘పలుచని షర్ట్‌ వేసుకున్న సమంత ఈ లుక్‌లో చాలా బోల్డ్ గా కనిపించి ఇంటర్నెట్‌ టెంపరేచర్‌ పెంచేలా ఉంది’ అని రాసింది.

Pooja Mishra : నా కెరీర్ ఆ హీరో వల్లే నాశనమైంది.. నాకు చేతబడి చేసి వాళ్ళ అమ్మాయిని స్టార్‌ని చేశారు..

 

దీంతో ఈ రెండు న్యూస్ లని స్క్రీన్ షాట్ తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి సమంత పలుచటి బట్టలు వేసుకుంటే పొగుడుతారు. నేను వేసుకుంటే మాత్రం తిడతారా అంటూ ప్రశ్నించింది ఉర్ఫీ జావెద్‌. ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటా నేనేం చెప్పాలనుకున్నానో. సమంత అంటే నాకు కూడా ఇష్టమే. నేను మాట్లాడేది ఇలాంటి వార్తల గురించి, అవి రాసేవాళ్ళు గురించి అని పోస్ట్ చేసింది.