Olive Oil : ఆలివ్ నూనె ఉపయోగించేవారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే!

ఆలివ్ అయిల్ లో ఇది నాణ్యమైనది. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉపయోగించరు. ఫ్యాటీ యాసిడ్ శాతం 0.6 కు మించదు. మరిగిస్తే చాలా నూనెలు వాసన, రుచిని కోల్పాతాయి. దీనిలో ఆసమస్య ఉండదు.

Olive Oil : ఆలివ్ నూనె ఉపయోగించేవారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే!

Olive Oil

Olive Oil : కొలెస్ట్రాల్ కారణంగా వచ్చే సమస్యలు అధికమవుతూ ఉండటంతో చాలా మంది ఆలివ్ నూనెను వాడటం మొదలు పెడుతున్నారు. అటు వైద్యులు సైతం ఆలివ్ నూనెను వాడుకోమని సలహా ఇస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ నూనె వినియోగం బాగా పెరుగుతోంది. అయితే దుకాణాలకు వెళ్ళి ఆలివ్ నూనెను కొనుగోలు చేసి తెచ్చుకునే వారు తప్పని సరిగా వాటిలోని రకాల గురించి తెలుసుకోవాలి.

ఎక్స్ ట్రా వర్జిన్ ఆలవ్ అయిల్ ; ఆలివ్ అయిల్ లో ఇది నాణ్యమైనది. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉపయోగించరు. ఫ్యాటీ యాసిడ్ శాతం 0.6 కు మించదు. మరిగిస్తే చాలా నూనెలు వాసన, రుచిని కోల్పాతాయి. దీనిలో ఆసమస్య ఉండదు. స్మోకింగ్ పాయింట్ తక్కువగా ఉండటంతో ఎక్కువ పర్యాయాలు మరిగించినా ప్రమాదం ఉండదు. త్వరగా పాడవ్వకుండా ఉంటుంది. ఆలివ్ జ్యూస్ నుండి చేయడం వల్ల దీనికి ఘైటైన వాసన ఉంటుంది. రుచి కూడా కొంచెం వగరుగా ఉంటుంది. ఈ నూనెతో చేసిన వంటల్ని తినటం కష్టంగానే ఉంటుంది. సలాడ్లపై చల్లు కోవటానికి , ఒంటికి రాసుకోవటానికి ఉపయోగపడుతుంది.

వర్జిన్ ఆలివ్ అయిల్ ; ఎక్స్ ట్రా వర్జిన్ తర్వాత స్ధానంలో ఈ అయిల్ ఉంటుంది. దీనిలో యాసిడ్ లెవల్స్ రెండు శాతానికి మించవు. ఇది కూడా డీప్ ఫ్రయింగ్ కి ఏమాత్రం పనికిరాదు. సలాడ్స్ వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు.

రిఫైన్డ్ ఆలివ్ అయిల్ ; వర్జిన్ అయిల్ ని రిఫైన్ చేయగా వచ్చే నూనె ఇది. మన సాధారణ రిఫైన్డ్ అయిల్స్ లాగా ఉంటుంది. వంటల్లో వాడుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇందులో యాసిడ్ స్ధాయి కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సలాడ్ల వంటి వాటిలో నేరుగా ఈ ఆయిల్ ను తీసుకోకపోవటమే బెటర్.

ప్యూర్ ఆలివ్ అయిల్ ; దీన్ని ప్రాసెసింగ్ చేయరు. కెమికల్స్ వాడరు. కాబట్టి ఈ నూనె సైతం మంచిదే. వంటల్లో దీనిని ఉపయోగించుకోవచ్చు.

ఆలివ్ పొమేస్ అయిల్ ; ఆలివ్స్ నుండి స్వచ్చమైన నూనె తీసేసిన తరువాత మిగిలిన పిప్పిలోంచి దీనిని తీస్తారు. ఈ అయిల్ లో పెద్దగా పోషకాలు ఉండవు. రుచి, వాసన, అంతగా ఉండవు, దీనిలో కొద్దిగా వర్జిన్ అయిల్ ని కలిపి వంగా నూనెగా విక్రయిస్తుంటారు. ఈ నూనె వంటల్లో వాడుకునేందుకు ఉపయోగకరంగా ఉండదు.

లైట్ ఆలివ్ ఆయిల్ ; ఇది తక్కువ గ్రేడ్ ఆయిల్. సాధారణ ఆలివ్ నూనెగా మాత్రమే దీన్ని పరిగణించాలి. ఇందులో పెద్ద ప్రత్యేకతలు ఏమీ ఉండవు. స్నాక్స్ వంటి వాటిని వేయించుకోవటానికి ఈ ఆయిల్ ను ఉపయోగించుకోవచ్చు.