Vaarasadu: వారసుడు ఎంట్రీ ఇచ్చేది ఆ ఓటీటీలోనే!

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘వారసుడు’ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా, ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజ ప్లాట్‌ఫాం భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Vaarasadu: వారసుడు ఎంట్రీ ఇచ్చేది ఆ ఓటీటీలోనే!

Vaarasadu: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారసుడు’ తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఇక ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో విజయ్ పాత్ర చాలా అల్ట్రా స్టైలిష్‌గా డిజైన్ చేశారు చిత్ర యూనిట్.

Vaarasadu: ‘వారసుడు’ రాకతో నిజమైన సంక్రాంతి..!

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. అయితే ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ రైట్స్‌ను అమ్మే పనిలో నిర్మాత దిల్ రాజు బిజీగా ఉన్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ రేటుకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. విజయ్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ క్రేజ్ ఉండటంతో, రేటు విషయంలో అమెజాన్ ప్రైమ్ వెనకాడలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Vijay: ‘వారసుడు’లో విజయ్ రోల్ ఇదేనా..?

ఇక భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోండగా, ఈ సినిమాతో దిల్ రాజు భారీ లాభాలను అందుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో తెలియాలంటే మాత్రం సంక్రాంతి పండగ వరకు వెయిట్ చేయాల్సిందే.