వనస్థలిపురంలో కరోనా : ఒక్కరి నుంచి 12 మందికి

  • Published By: madhu ,Published On : May 4, 2020 / 04:08 AM IST
వనస్థలిపురంలో కరోనా : ఒక్కరి నుంచి 12 మందికి

కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందో ఎవరికి తెలియదు. ఒక్కరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుందనే విషయం తెలిసిందే. తమలో కరోనా వైరస్ ఉందనే విషయం వారికి తెలియకపోవడంతో వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇటీవలే సూర్యాపేట జిల్లా ఘటన అందరికీ తెలిసే ఉంటుంది. తాజాగా GHMC పరిధిలోని వనస్థలిపురంలో ఒక్కరి నుంచి 12 మందికి కరోనా వైరస్ వ్యాప్తి చెందడం కలకలం రేపింది. ఇందులో 11 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. 

వనస్థలిపురంలో కిరాణ షాపు నిర్వహిస్తున్న వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండడం..అందర్నీ హఢలెత్తించింది. ఈ షాపు నుంచి సరుకులు తీసుకున్న వారు బెంబేలెత్తిపోతున్నారు. వీరిలో 169 మందిని అధికారులు గుర్తించి..క్వారంటైన్ కు తరలించారు. మిగిలిన వారిని గుర్తించేందుకు దృష్టి సారిస్తున్నారు. మూడు కుటుంబాల్లో 11 మందికి కరోనా సోకగా..వారిలో తండ్రి, కొడుకు చనిపోయాడు. 

కొద్ది రోజుల కిందట…సరూర్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి జ్వరంతో బాధ పడ్డాడు. ఇదిలా ఉండగానే..వనస్థలిపురంలో నివాసం ఉంటున్నో సోదరుడికి ఇంటికి వచ్చాడు. స్థానిక ఆసుపత్రికి వెళ్లగా..పరీక్షించి..గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఇతనికి కరోనా పాజిటివ్ ఉందని తేలింది. ఇదిలా కొనసాగుతుండగానే..ఈయన తండ్రి కాలి జారి పడి చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం చేయగా..కరోనా పాజిటివ్ వచ్చింది. వనస్థలిపురంలోనే ఇతని రెండో కుమారుడు ఇదే వైరస్ తో మూడు రోజుల క్రితం చనిపోయాడు. మరో నలుగురు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

SKD నగర్ లో ఉంటున్న వృద్దుడి కుమార్తెకు, ఆమె కుమారుడికి సైతం కరోనా ఉన్నట్లు తేలింది. తాజాగా 2020 మే 03వ తేదీ ఆదివారం వనస్థలిపురంలోని హుడా సాయి నగర్ లో నివాసం ఉంటున్న వృద్ధురాలి (60)కి వైరస్ నిర్ధారణ అయ్యిందని అధికారులు వెల్లడించారు. అనేక మంది దుకాణానికి వచ్చే వారితో పాటు..చాలా మంది అక్కడ కూర్చొని వీరితో సన్నిహితంగా మెలిగే వారని అధికారులు నిర్ధారించారు. 

వనస్థలిపురంలోని SKD నగర్ ఏ, బీ టైప్ క్వార్టర్స్, ఫేజ్ 1, హుడా సాయినగర్ లోని కొన్ని వీధులను కంటైన్ మెంట్ జోన్లుగా ప్రకటించారు. పలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. 

Also Read | వనస్థలిపురంలో విషాదం.. కరోనాతో తండ్రీకొడుకు మృతి