Jai Bhim : ‘జై భీమ్’ వివాదంలోకి జ్యోతిక.. మరోసారి కోర్టు నోటీసులు పంపిన వన్నియార్ సంఘం

తాజాగా 'జై భీమ్' సినిమా వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగేలా కనిపిస్తుంది. తాము వేసిన కేసు విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు అస్సలు స్పందించడం లేదు అంటూ వన్నియార్ సంఘం........

Jai Bhim : ‘జై భీమ్’ వివాదంలోకి జ్యోతిక.. మరోసారి కోర్టు నోటీసులు పంపిన వన్నియార్ సంఘం

Jai Bhim

Jai Bhim :  ఇటీవల సూర్య హీరోగా జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన ‘జై భీమ్’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా కొన్ని వివాదాల్లో చిక్కుకుంది. దీంతో సూర్యని, డైరెక్టర్ ని టార్గెట్ చేసి కొంతమంది విమర్శలకు దిగుతున్నారు. ప్రకాష్ రాజ్ వివాదం మరవకముందే ఇందులో కొన్ని సీన్స్ లో తమను అవమానించారు అని, తమని విలన్స్ గా చూపించారు అని వన్నియార్ సామాజిక వర్గంకు చెందిన వాళ్ళు ఆరోపించారు.

Brahmanandam : మీమ్స్ చేసే వాళ్లందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా : బ్రహ్మానందం

ఈ విమర్శలు కోర్టు వరకు వెళ్లాయి. వన్నియార్ సంఘం నాయకులు కోర్టులో ఏకంగా అయిదు కోట్లకు సూర్య పై పరువు నష్టం దావా వేయడం కూడా జరిగింది. అంతే కాకుండా కొంతమంది సూర్యని బెదిరింపులకు గురి చేశారు. దీంతో సూర్య మరియు అతని కుటుంబ సభ్యులపై వన్నియార్ సంఘం వారు దాడులు చేసే అవకాశాలు ఉన్నాయంటూ అనుమానాలు రావడంతో సూర్య ఇంటి వద్ద పోలీసు భద్రతని ఏర్పాటు చేశారు. ‘జై భీమ్’ సినిమాని స్వయంగా సూర్యనే నిర్మించడంతో ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ సన్నివేశాలను తొలగించి చిత్ర యూనిట్ క్షమాపణ చెప్పాలని వన్నియార్ సంఘం కోరింది.

Akhanda: ‘అఖండ’ కోసం 120 మంది సింగర్స్… 500 మంది మ్యుజిషియన్స్.. తమన్ ప్లాన్ మాములుగా లేదుగా

తాజాగా ‘జై భీమ్’ సినిమా వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగేలా కనిపిస్తుంది. తాము వేసిన కేసు విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు అస్సలు స్పందించడం లేదు అంటూ వన్నియార్ సంఘం నాయకులూ మళ్లీ కేసు నమోదు చేశారు. ఈసారి సూర్య నిర్మాణ సంస్థ 2డి ఎంటర్ టైన్మెంట్స్ ను ఏ1గా తీసుకోవాలని, సూర్యను ఏ2గా, జ్యోతికను ఏ3గా, దర్శకుడు జ్ఞానవేల్ ను ఏ4గా, అమెజాన్ ను ఏ5గా చేర్చుతూ కేసు నమోదు చేశారు. ఇప్పటికైనా దీనిపై సూర్య స్పందిస్తారేమో చూడాలి.