Gyanvapi Masjid Case : జ్ఞానవాపి మసీదు కేసులో కీలక తీర్పు.. శాస్త్రీయ సర్వేకు అనుమతించిన వారణాసి కోర్టు

జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉన్నట్లుగా హిందు ప్రతినిధులు చెబుతున్న వాజూ ఖానా మినహా అంతటా సర్వే చేసుకునేంందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో భారత పురావస్తూ పరిశోధనా సంస్థ జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించనుంది.

Gyanvapi Masjid Case : జ్ఞానవాపి మసీదు కేసులో కీలక తీర్పు.. శాస్త్రీయ సర్వేకు అనుమతించిన వారణాసి కోర్టు

Gyanvapi Masjid case

Varanasi Court Scientific Survey : జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వారాణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు కోర్టు అనుమతించింది. జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు అనుమతించాలంటూ దాఖటైన పిటిషన్ పై ఇప్పటికే కోర్టు వాదనలు విన్నది. తాజాగా శుక్రవారం కోర్టు శాస్త్రీయ సర్వేకు అనుమతిస్తూ  తీర్పు ఇచ్చింది.

జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉన్నట్లుగా హిందు ప్రతినిధులు చెబుతున్న వాజూ ఖానా మినహా అంతటా సర్వే చేసుకునేంందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో భారత పురావస్తూ పరిశోధనా సంస్థ జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించనుంది. జ్ఞానవాపి మసీదు అడుగున హిందూ ఆలయం ఉందా, లేదా అన్న విషయాన్ని కనిపెట్టాలని ఆర్కియాలజీ సర్వే అధికారులను కోర్టు ఆదేశించింది.

YS Viveka Case : వివేకా హత్య కేసు.. సీబీఐ ఛార్జ్ షీట్ లో కీలక అంశాలు

ఈ సర్వే పూర్తి చేసి ఆగస్టు4వ తేదీ కల్లా నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కాగా, ఈ కేసు విచారణ మరోసారి ఉన్నత న్యాయస్థానం వరకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించేందుకు అనుమతించాలంటూ హిందువుల తరపున
న్యాయవాది విష్ణు శంకర్ జైన్ పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్ పై జులై 14న వారణాసి జిల్లా కోర్టు వాదనలు విన్నది. ఆ తర్వాత అన్ని అంశాలను పరిశీలించి సర్వేకు అనుమతిస్తున్నట్లు శుక్రవారం తీర్పు వెలువరించింది. వారణాసి కోర్టు తీర్పు విషయాన్ని న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మీడియాకు వివరించారు. ఈ తీర్పు కేసులో టర్నింగ్ పాయింట్ అవుతుందని హిందువుల తరపున వాదించిన న్యాయవాది సుభాష్ సందన్ చతుర్వేది వ్యాఖ్యానించారు.