Ram Charan-Venkatesh : అమెరికా పెళ్ళిలో చరణ్-వెంకీ మామ సందడి.. వెంకీ మామ చరణ్ గురించి ఏమన్నాడో తెలుసా?

తాజాగా అమెరికాలోని ఓ తెలుగు వాళ్ళ పెళ్లి వేడుకకు హాజరయ్యాడు చరణ్. అదే పెళ్ళికి వెంకటేష్ కూడా రావడంతో పెళ్ళిలో మరింత సందడి నెలకొంది. స్టేజిపై చరణ్, వెంకీ మామ పక్కపక్కనే నిల్చొని హంగామా చేశారు. ఇక వెంకటేష్ మైక్ తీసుకొని చరణ్ గురించి మాట్లాడుతూ...............

Ram Charan-Venkatesh : అమెరికా పెళ్ళిలో చరణ్-వెంకీ మామ సందడి.. వెంకీ మామ చరణ్ గురించి ఏమన్నాడో తెలుసా?

Venkatesh appreciate Ram Charan in a private wedding event at america video goes viral

Updated On : February 27, 2023 / 10:14 AM IST

Ram Charan-Venkatesh :  ప్రస్తుతం RRR యూనిట్ అంతర్జాతీయంగా పలు అవార్డులు అందుకుంటూ బిజీగా అంది. RRR టీం మొత్తం అమెరికాలోనే ఉంటూ పలు సినిమా ఈవెంట్స్ కి హాజరవుతూ, అవార్డులు అందుకుంటూ, సినిమాని మరింత ప్రమోట్ చేస్తున్నారు. దీంతో రామ్ చరణ్ కూడా చిత్రయూనిట్ తో అమెరికాలోనే ఉన్నాడు. ఇటీవలే HCA అవార్డుల్లో పాల్గొని వైరల్ అయ్యాడు.

Naatu Naatu Song : నాటు నాటు సాంగ్ కి కొరియన్స్ డ్యాన్స్.. ప్రధాని మోదీ ట్వీట్..

తాజాగా అమెరికాలోని ఓ తెలుగు వాళ్ళ పెళ్లి వేడుకకు హాజరయ్యాడు చరణ్. అదే పెళ్ళికి వెంకటేష్ కూడా రావడంతో పెళ్ళిలో మరింత సందడి నెలకొంది. స్టేజిపై చరణ్, వెంకీ మామ పక్కపక్కనే నిల్చొని హంగామా చేశారు. ఇక వెంకటేష్ మైక్ తీసుకొని చరణ్ గురించి మాట్లాడుతూ.. నాటు నాటు అంటూ మన అందర్నీ గర్వపడేలా చేస్తున్నావు, అన్ని అవార్డులు నీకే వస్తున్నాయి అంటూ సరదాగా కామెంట్స్ చేశారు. దీంతో చరణ్ థ్యాంక్యూ వెంకీ మామ అని అన్నారు. చరణ్, వెంకటేష్ స్టేజి మీద సరదాగా మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.