Venkatesh Iyer: 15 ఏళ్ల నిరీక్షణకు తెర‌దించిన‌ వెంక‌టేశ్ అయ్య‌ర్‌.. మెక్‌క‌ల్ల‌మ్ త‌రువాత‌

దాదాపు 15 ఏళ్ల క‌రువుకు తెర‌దించాడు వెంక‌టేశ్ అయ్య‌ర్‌.ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడుతున్న వెంక‌టేశ్ అయ్య‌ర్ 49 బంతుల్లో త‌న తొలి శ‌త‌కాన్ని న‌మోదు చేశాడు.

Venkatesh Iyer: 15 ఏళ్ల నిరీక్షణకు తెర‌దించిన‌ వెంక‌టేశ్ అయ్య‌ర్‌.. మెక్‌క‌ల్ల‌మ్ త‌రువాత‌

Venkatesh Iyer and Brendon McCullum

Venkatesh Iyer: అది 2008వ సంవ‌త్స‌రం. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) తొలి సీజ‌న్‌లోని మొద‌టి మ్యాచ్‌. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా టీ20 మ‌జా అంటే ఏంటో క్రికెట్ అభిమానుల‌కు రుచి చూపించింది. ఆ మ్యాచ్‌లో ఓపెన‌ర్ గా బ‌రిలోకి దిగిన బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్ చెల‌రేగిపోయాడు. కేవ‌లం 73 బంతుల్లోనే 158 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్‌తో పెను విధ్వంస‌మే సృష్టించాడు. ఐపీఎల్ స‌క్సెస్ కావ‌డానికి ఈ ఇన్నింగ్స్ ఓ కార‌ణంగానే చెబుతుంటారు.

ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లోనే కోల్‌క‌తా బ్యాట‌ర్ మెక్‌క‌ల్ల‌మ్ తొలి సెంచ‌రీ న‌మోదు చేశాడు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు 15 సీజ‌న్లు ముగిశాయి. 16వ సీజ‌న్ న‌డుస్తోంది. 75కు పైగా శ‌త‌కాలు న‌మోదు అయ్యాయి. అయిన‌ప్ప‌టికీ ఇంత వ‌ర‌కు మెక్‌క‌ల్ల‌మ్ మినహా మ‌రే ఇత‌ర కోల్‌క‌తా బ్యాట‌ర్ కూడా మ‌రో శ‌త‌కాన్ని అందుకోలేదు. దాదాపు 15 ఏళ్ల క‌రువుకు తెర‌దించాడు వెంక‌టేశ్ అయ్య‌ర్‌.

IPL 2023, MI vs KKR: తిల‌క్ వ‌ర్మ ఔట్‌.. మూడో వికెట్ కోల్పోయిన ముంబై..live updates

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడుతున్న వెంక‌టేశ్ అయ్య‌ర్ 49 బంతుల్లో త‌న తొలి శ‌త‌కాన్ని న‌మోదు చేశాడు. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న అయ్య‌ర్ 6 ఫోర్లు, 9 సిక్స‌ర్ల‌లో 104 ప‌రుగులు చేశాడు. దీంతో కోల్‌క‌తా త‌రుపున సెంచ‌రీ చేసిన రెండో బ్యాట‌ర్‌గా రికార్డులకు ఎక్కాడు. ఇక ఈ సీజ‌న్‌లో ఇది రెండో శ‌త‌కం. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన హ్యారీ బ్రూక్ నైట్ రైడర్స్‌పై అజేయంగా 55 బంతుల్లో 100 పరుగులు చేసి సీజన్‌లో మొదటి సెంచరీ చేసిన సంగ‌తి తెలిసిందే.

IPL 2023: వరుస ఓటములతో లాస్ట్ ప్లేస్‌లో ఢిల్లీ క్యాపిటల్స్.. వారిదే బాధ్యత అంటూ సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు