Venkatesh: శైలేష్‌తో సినిమాను ఆ రోజున స్టార్ట్ చేస్తోన్న వెంకీ..?

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ లాస్ట్ మూవీ ‘F3’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘ఓరి దేవుడా’ సినిమాలో ఓ కేమియో పాత్రలో వెంకీ కనిపించాడు. కాగా, బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ఓ సినిమాలోనూ వెంకీ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే తెలుగులో తన నెక్ట్స్ మూవీని ‘హిట్’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలనుతో కలిసి తెరకెక్కించేందుకు వెంకీ రెడీ అవుతున్నాడు.

Venkatesh: శైలేష్‌తో సినిమాను ఆ రోజున స్టార్ట్ చేస్తోన్న వెంకీ..?

Venkatesh Sailesh Kolanu Movie To Be Launched On This Date

Venkatesh: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ లాస్ట్ మూవీ ‘F3’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘ఓరి దేవుడా’ సినిమాలో ఓ కేమియో పాత్రలో వెంకీ కనిపించాడు. కాగా, బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ఓ సినిమాలోనూ వెంకీ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే తెలుగులో తన నెక్ట్స్ మూవీని ‘హిట్’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలనుతో కలిసి తెరకెక్కించేందుకు వెంకీ రెడీ అవుతున్నాడు.

Venkatesh: వెంకీకి ఆ పాత్రలో మరో ‘హిట్’ ఇస్తానంటోన్న డైరెక్టర్..?

ఇటీవల ‘హిట్-2’తో అదిరిపోయే సక్సెస్ అందుకున్న శైలేష్, వెంకీకి ఓ కథను వినిపించగా.. అది బాగా నచ్చిన వెంకీ వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాను త్వరలోనే ప్రారంభిస్తారని చిత్ర వర్గాల్లో టాక్ వినిస్తోంది. అయితే ఈ సినిమా లాంచ్‌కు వెంకీ అండ్ టీమ్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. శైలేష్‌తో తెరకెక్కించబోయే సినిమాను జనవరి 26న పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యిందట.

Venkatesh: వెంకీ సైలెంట్‌గా ఎందుకు ఉన్నాడు..?

ఈమేరకు త్వరలోనే ఓ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రావచ్చని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో వెంకీని అల్ట్రా స్టైలిష్ పాత్రలో శైలేష్ మనకు చూపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమా హిట్ వర్స్‌లోని సీక్వెల్ మూవీ అవుతుందా.. లేక సరికొత్త కథతో వేరొక చిత్రంగా వస్తుందా అనేది ఇప్పటికైతే సస్పెన్స్‌లోనే ఉంది. మరి రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాను లాంచ్ చేస్తారా లేక మరింత సమయం తీసుకుంటారా అనేది చూడాలి.