Saindhav: వెంకీ ‘సైంధవ్’ కోసం ఏకంగా ముగ్గరు హీరోయిన్లు.. కానీ అదే ట్విస్టు!

విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రాన్ని ‘హిట్’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ లభించింది. వెంకీని పవర్‌ఫుల్ పాత్రలో శైలేష్ తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీతో తీసుకొస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Saindhav: వెంకీ ‘సైంధవ్’ కోసం ఏకంగా ముగ్గరు హీరోయిన్లు.. కానీ అదే ట్విస్టు!

Venkatesh Saindhav Movie To Have Three Heroines

Saindhav: విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రాన్ని ‘హిట్’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ లభించింది. వెంకీని పవర్‌ఫుల్ పాత్రలో శైలేష్ తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీతో తీసుకొస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Saindhav: వెంకటేష్ ‘సైంధవ్’ బ్యాక్‌డ్రాప్ ఇదేనా..?

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా, ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా అభిమానులు తప్పక ఫాలో అవుతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ నటిస్తుండటంతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లను తీసుకునేందుకు శైలేష్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందట. కథ ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు భామలకు ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురిలో ఒకరు బాలీవుడ్ హీరోయిన్ కాగా, మరో ఇద్దరు సౌత్ భామలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Saindhav: వెంకీ ల్యాండ్‌మార్క్ మూవీ ‘సైంధవ్’లో బాలీవుడ్ యాక్టర్.. ఎవరంటే..?

కానీ, ఈ ముగ్గురిలో ఎవరూ వెంకీతో రొమాన్స్ చేయరట. వారి పాత్రలు సినిమా కథలో కీలకంగా ఉంటాయని.. అయితే వెంకీతో రొమాన్స్ మాత్రం ఉండదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. వెంకీ పాత్ర చాలా సీరియస్ మోడ్‌లో ఉంటుందని.. అందుకే ఆయన పాత్రకు దర్శకుడు ఎలాంటి రొమాంటిక్ యాంగిల్‌ను యాడ్ చేయడం లేదని తెలుస్తోంది. మరి సైంధవ్ మూవీలో ముగ్గురు హీరోయిన్లుగా ఎవరు నటిస్తారా.. వారి పాత్రలు ఎలా ఉండబోతాయా అనేది ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.