Students Kissing Competition : కాలేజీ విద్యార్ధుల మధ్య ముద్దుల పోటీ..వాట్సాప్ లో వైరల్

Students Kissing Competition : కాలేజీ విద్యార్ధుల మధ్య ముద్దుల పోటీ..వాట్సాప్ లో వైరల్

Students Kissing Competition

Updated On : July 22, 2022 / 1:26 PM IST

Students Kissing Competition :కర్ణాటకలోని మంగళూరులో ఓ ప్రముఖ కళాశాలకు చెందిన విద్యార్ధిని.. విద్యార్ధులు ఓ అపార్ట్‌మెంట్‌లో ముద్దుల్లో మునిగిపోయారు. ముద్దుల్లో మునిగిపోయిన సమయంలో సదరు జంటలు కాలేజీ యూనిఫామ్ లోనే ఉన్నారు. ముగ్గురు అమ్మాయిలు..ముగ్గురు అబ్బాయిలు కాలేజీ యూనిఫామ్‌ ధరించి.. మెడలో ఐడీ కార్టులు వేసుకుని ఉన్న వారు ముద్దు పెట్టుకుంటూ (లిప్ లాక్ )తన్మయత్వంలో మునిగిపోగా..చుట్టూ ఉన్న వారి స్నేహితులు కేకలు వేస్తూ వారిని మరింతగా ప్రోత్సహిస్తున్నారు. ఇదంతా ఆ వీడియోలో కనిపించింది. అది ముద్దుల పోటీ అని పోలీసులు తెలిపారు. ఈ వీడియో తీసిన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

వారు ముద్దులు పెట్టుకుంటూ తన్మయత్వంలో మునిగిపోగా..చుట్టూ ఉన్న వారి స్నేహితులు కేకలు వేస్తూ వారిని మరింతగా ప్రోత్సహిస్తున్నారు. ఇదంతా ఆ వీడియోలో కనిపించింది. అది ముద్దుల పోటీ అని పోలీసులు తెలిపారు. ఈ వీడియో తీసిన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

ఈ వీడియోఆరు నెలల క్రితం నాటిదని మంగళూరు పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ తెలిపారు. వారం రోజుల క్రితం ఈ వీడియోను యువకుడు వాట్సాప్‌లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సదరు కాలేజీ యాజమాన్యం వారికి వార్నింగ్ ఇవ్వటమే కాకుండా కాలేజీ నుంచి తొలగించింది. కాగా..ఈ ముద్దుల కాంపిటిషన్‌పై విద్యార్థుల తల్లిదండ్రులు కానీ..కాలేజీ యాజమాన్యం కానీ ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదని కమిషనర్ తెలిపారు. కిస్సింగ్ కాంపిటిషన్ సందర్భంగా విద్యార్థులు ఏమైనా డ్రగ్స్ ఉపయోగించారా? లేదా విద్యార్ధులు పందెం వేసుకుని ఇలా ముద్దుల పోటీ పెట్టుకున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.