IND vs AFG : అఫ్గాన్‌తో వన్డే సిరీస్.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై భారత కోచ్ కీలక కామెంట్స్.. పెద్ద వార్త అవుతుందని తెలుసు.. కానీ..
భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య (IND vs AFG) జూన్ 13 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
Ryan Ten Doeschate comments on Virat Kohli and Rohit Sharma fitness status ahead of AFG odi series
- జూన్ 13 నుంచి భారత్ వర్సెస్ అఫ్గాన్ వన్డే సిరీస్
- కోహ్లీ, రోహిత్ ఆడడం అనుమానమే
- కీలక వ్యాఖ్యలు చేసిన సహాయ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే
IND vs AFG : భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జూన్ 6 నుంచి 10 వరకు ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జూన్ 13 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. కాగా.. ఇప్పటికే వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించారు. అయితే.. తాజాగా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు వన్డే సిరీస్‌కు దూరం అవుతారని వార్తలు వస్తున్నాయి.
గాయం కారణంగా విరాట్ కోహ్లీ అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు దూరం కావడం ఖాయమని అంటున్నారు. ఇక జట్టును ప్రకటించే సమయంలోనే రోహిత్ శర్మ.. తన ఫిట్నెస్ ను నిరూపించుకుంటేనే జట్టులో చోటు ఉంటుందని సెలక్టర్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటి వరకు హిట్‌మ్యాన్ ఫిట్నెస్ టెస్టుకు హాజరు కానట్లు తెలుస్తోంది.
టెస్టు మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారత క్రికెట్ జట్టు సహాయ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే మాట్లాడాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పై కీలక వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి పెద్ద ప్లేయర్లు సిరీస్‌లో ఆడకపోతే అది చాలా పెద్ద వార్త అవుతుందనే విషయం తనకు తెలుసునని అన్నాడు. అయితే.. ఫిట్‌నెస్‌కు సంబంధించిన ప్రోటోకాల్స్ అందరికి ఒకేలా ఉంటాయన్నాడు. వన్డే సిరీస్ ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులున్నాయి. ఈ లోగా వారిద్దరి ఫిట్నెస్ను అంచనా వేస్తాము. ఫిట్‌గా ఉంటే తుది జట్టులో ఉంటారు. లేకపోతే అందుకు అనుగుణంగా మార్పులు చేసుకుంటాం. వైద్య బృందం ధృవీకరించిన తరువాతనే అధికారిక ప్రకటన వస్తుందని అనుకుంటున్నాను అని డస్కటే అన్నాడు.
