Anand Mahindra : పల్లెటూర్లలో ప్రాణదాత ఈ వాహనం.. అంటూ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో వైరల్

వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎటువంటి ట్వీట్ చేసినా వైరల్ అవుతుంది. జనానికి ఎంతో ఉపయోగకరమైన అంశాలతో పాటు కొత్త ఇన్వెన్షన్లకు సంబంధించిన వీడియోలను ఆయన షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన నాలుగు చక్రాల వాహనం వీడియో వైరల్ అవుతోంది.

Anand Mahindra : పల్లెటూర్లలో ప్రాణదాత ఈ వాహనం.. అంటూ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో వైరల్

Anand Mahindra

Updated On : June 11, 2023 / 2:29 PM IST

Anand Mahindra : వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఏది ట్వీట్ చేసినా ఆలోచింపచేస్తాయి. రీసెంట్‌గా ఆయనను ఓ నాలుగు చక్రాల వాహనం ఎంతగానో ఆకర్షించింది. మారుమూల ప్రాంతాలకు ఈ వాహనం లైఫ్ సేవర్‌గా ఉపయోగపడుతుంది అంటూ ఆయన షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Beautiful Villages List : ఇండియాలోనే అందమైన గ్రామాలు చూడాలనుకుంటున్నారా? ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన లిస్ట్ చూడండి

ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో ఒక వ్యక్తి నాలుగు చక్రాలతో తయారు చేసిన వాహనాన్ని నడుపుతున్న వీడియో షేర్ చేసారు. వాస్తవానికి ఈ వీడియో MANJARI DAS అనే ట్విట్టర్ యూజర్ నుంచి ఆనంద్ మహీంద్రా షేర్ చేసుకున్నారు. ‘నాకు కనీసం పది మంది స్నేహితులు ఈ వీడియోని పంపి ఉంటారు. ఈ వాహనం భలే ఆకర్షిస్తోంది. మారుమూల ప్రాంతాలు, పల్లెల్లో ఇది ప్రాణదాతగా ఉపయోగపడొచ్చు’ అనే శీర్షికతో ఆనంద్ మహేంద్రా ఈ వీడియోను పోస్ట్ చేశారు. పెట్రోలు బంక్ దగ్గర ఓ వ్యక్తి ఈ వాహనాన్ని నడుపుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఒక ఇంజన్, నాలుగు చక్రాలు మరియు స్టీరింగ్‌తో ఈ వాహనాన్ని తయారు చేశారు. దీనిపై అనేకమంది స్పందించారు.

Anand Mahindra : ‘ఫోల్డబుల్ హౌస్’ చూసారా? తనకు చాలా నచ్చిందంటున్న ఆనంద్ మహీంద్రా

‘మధ్యతరగతి ప్రజలు సాంకేతికత ఉపయోగించి సమస్యల పరిష్కారం దిశగా కొత్త విషయాలు ఆవిష్కరిస్తున్నారు’ అని ఒకరు.. ‘ఈ వాహనం మారుమూల ప్రాంతాల్లో నిస్సందేహంగా లైఫ్ సేవర్‌గా ఉపయోగపడుతుంది’ అని మరొకరు స్పందించారు. చూడటానికి ముచ్చటగా ఉన్న ఈ వెహికల్ అత్యవసర పరిస్థితుల్లో నిజంగా జనానికి సహాయకారిగా అనిపిస్తోంది.