Beautiful Villages List : ఇండియాలోనే అందమైన గ్రామాలు చూడాలనుకుంటున్నారా? ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన లిస్ట్ చూడండి

వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఇంటర్నెట్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన ఆలోచనలు పంచుకుంటారు. కొన్ని సలహాలు..సూచనలు చేస్తుంటారు.. తాజాగా భారతదేశంలో పర్యటించదగ్గ 10 అందమైన గ్రామాల జాబితాను ఫోటోలతో ఆయన షేర్ చేశారు. నెటిజన్లు అద్భుతం అంటున్నారు.

Beautiful Villages List : ఇండియాలోనే అందమైన గ్రామాలు చూడాలనుకుంటున్నారా? ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన లిస్ట్ చూడండి

Anand Mahindra

Beautiful Villages – Anand Mahindra : సెలయేర్లు.. పచ్చని పైర్లు.. మొక్కలతో ఉండే పల్లెటూర్లంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఇండియా (India)లో అలాంటి ఎన్నో అందమైన గ్రామాలున్నాయి. సమయం దొరికితే చాలు ఓసారి చూసి రావాలి అనుకునేవారికి వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఏకంగా ఓ లిస్ట్ చెప్పారు. ఆయన షేర్ చేసిన జాబితా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

Anand Mahindra : ‘ఫోల్డబుల్ హౌస్’ చూసారా? తనకు చాలా నచ్చిందంటున్న ఆనంద్ మహీంద్రా

ఆనంద్ మహీంద్రా ఇంటర్నెట్‌లో యాక్టివ్‌గా ఉంటారు అని అందరికీ తెలుసు. ప్రజలకు ఉపయోగపడే ఎన్నో అంశాలను సైతం షేర్ చేస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా రీ-షేర్ చేసిన భారతదేశంలోని అందమైన గ్రామాల థ్రెడ్‌ చూసి నెటిజన్లు అద్భుతం అంటున్నారు.

ఇండియాలో ఎంతో అందంగా ఉండే గ్రామాలు అంటూ ‘ హిమాచల్ ప్రదేశ్‌లోని కల్ప, మేఘాలయలో అత్యంత పరిశుభ్రంగా చెప్పబడే గ్రామం మావ్లిన్నోంగ్, కేరళ పాలక్కాడ్‌లోని కొల్లెంగోడ్ గ్రామం, తమిళనాడు కన్యాకుమారిలోని మత్తూర్ గ్రామం, కర్ణాటకలోని వరంగ గ్రామం, పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్‌లోని గోర్ఖే ఖోలా ,ఒడిశాలోని జిరాంగ్ గ్రామం, అరుణాచల్ ప్రదేశ్‌లోని జిరో గ్రామం, ఉత్తరాఖండ్‌లోని మనా, (భారతదేశంలోని చివరి గ్రామం), రాజస్థాన్‌లోని ఖిమ్సర్ గ్రామాలు ఈ థ్రెడ్ లో ఉన్నాయి.

Anand Mahindra : నా ఇద్దరి మనవల భద్రత నాకు ముఖ్యం.. అంటూ ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ వైరల్

‘మన చుట్టూ ఉన్న ఈ అందం నన్ను మాట్లాడనీయకుండా చేసింది…భారతదేశంలో ప్రయాణం కోసం నా దగ్గర ఉన్న లిస్ట్ చూస్తే సంతోషం పొంగిపోతోంది’ అంటూ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ట్వీట్ చూసి నెటిజన్లు ‘అద్భుతం’ అని స్పందించారు. ఈ పోస్ట్ వాస్తవానికి కలర్స్ ఆఫ్ భారత్ అనే ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టు చేయబడింది. ఇక ఈ పోస్టును చాలామంది షేర్ చేసుకున్నారు. ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’ అని ఒకరు.. ‘ మెస్మరైజింగ్’ అని మరొకరు ఇలా అభిప్రాయాలు షేర్ చేశారు. మొత్తానికి ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన గ్రామాల లిస్ట్ పర్యాటకులకు ఉపయోగపడొచ్చు.