Vijay Devarakonda : అభిమానులను ఫ్రీ హాలీడే ట్రిప్‌కు పంపిస్తున్న విజయ్ దేవరకొండ..

సినిమా పలితాలతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్నాడు టాలీవుడ్ హీరో విజయ దేవరకొండ. తన యాటిట్యూడ్ అండ్ స్టైల్‌ కంటే విజయ్ తన అభిమానాలకు ఇచ్చే అటెన్షన్.. విజయ్‌కి ఫ్యాన్స్ వీరాభిమానులు అయ్యేలా చేసింది. కాగా గత ఐదేళ్లుగా దేవరశాంటా పేరుతో న్యూ ఇయర్ బహుమతులు ఇస్తూ ఛారిటీ కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ స్టార్ హీరో.

Vijay Devarakonda : అభిమానులను ఫ్రీ హాలీడే ట్రిప్‌కు పంపిస్తున్న విజయ్ దేవరకొండ..

Vijay Deverakonda is sending his fans on a free holiday trip

Updated On : December 26, 2022 / 1:51 PM IST

Vijay Devarakonda : సినిమా పలితాలతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్నాడు టాలీవుడ్ హీరో విజయ దేవరకొండ. తన యాటిట్యూడ్ అండ్ స్టైల్‌ కంటే విజయ్ తన అభిమానాలకు ఇచ్చే అటెన్షన్.. విజయ్‌కి ఫ్యాన్స్ వీరాభిమానులు అయ్యేలా చేసింది. కాగా గత ఐదేళ్లుగా దేవరశాంటా పేరుతో న్యూ ఇయర్ బహుమతులు ఇస్తూ ఛారిటీ కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ స్టార్ హీరో.

Vijay Devarakonda: రౌడీ స్టార్‌తో స్టార్ డైరెక్టర్ మూవీ.. లేనట్టేనా..?

అభిమానులకు ఒక్కో సంవత్సరం ఒక్కో బహుమతి ఇస్తూ సర్ప్రైజ్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు ప్రపంచం లో ఏ హీరో చేయని విధంగా చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది కూడా మరో సరికొత్త ఆలోచనతో దేవరశాంటాగా ముందుకొచ్చాడు విజయ్. 100 మంది అభిమానులను ఫ్రీ హాలీడే టూర్ కు పంపించబోతున్నారు. దేవరశాంటా యాష్ ట్యాగ్ పేరుతో తనకు వచ్చిన రిక్వెస్టుల నుంచి వందమంది అభిమానులను ఎంపికచేసి పూర్తి ఖర్చులు తానే భరించి వెకేషన్ పంపించబోతున్నాడు.

ఇందుకు నాలుగు ఆప్షన్స్ విజయ్ సూచించాడు. మౌంటెయిన్స్ ఆఫ్ ఇండియా, బీచెస్ ఆఫ్ ఇండియా, కల్చర్ ట్రిప్ ఆఫ్ ఇండియా, డిసెర్ట్స్ ఇన్ ఇండియా.. ఇలా ఈ నాలుగు ఆప్షన్స్ లో ఎక్కడికి టూర్ కు వెళ్లాలన్నా విజయ్ దేవరకొండ పూర్తిగా ఉచితంగా పంపించబోతున్నాడు. ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ హీరో తన అభిమానులను ఇలా ఫ్రీ హాలీడే ట్రిప్ కు పంపించలేదు. సెలవుల్లో ఏదైనా టూర్ కు వెళ్లాలనుకుని ఖర్చులకు సందేహించే అభిమానులు దేవరశాంటా ఆలోచనను ప్రశంసిస్తున్నారు.