Kushi : సాంగ్ ప్రోమోతో కొత్త అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. సమంత పాత్ర ఏంటో తెలుసా?

ఖుషి ఫస్ట్ సింగల్ ని మే 9న రిలీజ్ చేస్తామంటూ విజయ్ దేవరకొండ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశాడు.

Kushi : సాంగ్ ప్రోమోతో కొత్త అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. సమంత పాత్ర ఏంటో తెలుసా?

Vijay Deverakonda Samantha Kushi first song promo released

Kushi : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) కలిసి నటిస్తున్న సినిమా ‘ఖుషీ’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గత ఏడాది చివరిలోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సమంత అనారోగ్య కారణాలు వల్ల మూవీ షూటింగ్ లేటు అవ్వడంతో రిలీజ్ వాయిదా పడింది. ఇటీవలే సమంత మళ్ళీ సెట్స్ లోకి అడుగు పెట్టడంతో షూటింగ్ మొదలైంది. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తామంటూ ప్రకటించారు. తాజాగా చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు.

Naga Chaitanya : సమంత మంచి అమ్మాయి.. ఆమె సంతోషంగానే ఉండాలి.. నాగచైతన్య కామెంట్స్!

ఈ క్రమంలోనే ఈ మూవీలోని ఫస్ట్ సింగల్ ని మే 9న రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. కాశ్మీర్ లోయల్లో ఈ సాంగ్ చిత్రీకరణ జరిగినట్లు ఈ ప్రోమోలో తెలుస్తుంది. ఇక ఈ ప్రోమోలోనే సమంత పాత్రని రివీల్ చేశారు. ప్రోమోలో సమంత నమాజ్ చేస్తూ కనిపిస్తుంది. దీంతో ఈ సినిమాలో సమంత ముస్లిం యువతిగా కనిపించబోతుందా? లేదా సందర్భం కోసం క్రియేట్ చేసిన సన్నివేశామా? అనేది తెలియాలి. ప్రోమో చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది.

Samantha : సమంత బర్త్ డే వేడుకల్లో రచ్చ రచ్చ.. లేట్ గా పోస్ట్ చేసినా మాములుగా లేవుగా..

ఈ సినిమాకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. మే 9న రిలీజ్ అయ్యే పూర్తి సాంగ్ ఆడియన్స్ ని ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ లాంగ్వేజ్స్ లో కూడా ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శివ నిర్వాణ లవ్ మూవీస్ ని చాలా సెన్సిబుల్ గా తెరకెక్కిస్తాడని ఆడియన్స్ లో మంచి పేరు ఉంది. మరి ఈ సినిమాతో ఆడియన్స్ నమ్మకాన్ని నిలబెడతాడా? లేదా? చూడాలి.