Vijayendra Prasad : ఎన్టీఆర్, చరణ్ కొట్టుకుంటుంటే నాకు ఏడుపొచ్చింది

ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ''ఈ కథలో చరణ్‌, తారక్‌లు ఇద్దరూ ప్రాణమిత్రులు. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చేంత స్నేహితులు. కాని ఇద్దరి ఐడియాలజీ వేరు. సినిమా మొదటి........

Vijayendra Prasad : ఎన్టీఆర్, చరణ్ కొట్టుకుంటుంటే నాకు ఏడుపొచ్చింది

Rrr

 

Vijayendra Prasad :  రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో రూపొందించిన భారీ మల్టిస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. అలియా భట్, అజయ్ దేవగణ్ లాంటి బాలీవుడ్ స్టార్లు కూడా ఈ సినిమాలో నటించారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా మార్చ్ 25న రిలీజ్ కానుంది.

దీంతో మరోసారి దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు చరణ్, తారక్, రాజమౌళి. ఇక ఈ ఇంటర్వ్యూలలో పలు ఆసక్తికర విషయాలని కూడా పంచుకుంటున్నారు. అయితే ఈ ప్రమోషన్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ టీం నుంచి అందరూ కనిపిస్తున్నారు కాని ఈ సినిమాకి మెయిన్ కథ అందించిన విజయేంద్రప్రసాద్ మాత్రం ఇన్నాళ్లూ ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించలేదు. తాజాగా సినిమా రిలీజ్ మరో రెండు రోజులు ఉంది అనగా విజయేంద్ర ప్రసాద్ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్స్‌ లో పాల్గొన్నారు. తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను తెలిపారు.

RRR: ఫుల్ స్వింగ్‌లో ప్రమోషన్స్.. నార్త్‌లో ఆసక్తిలేని ప్రీ రిలీజ్ బుకింగ్స్!

ఈ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ”ఈ కథలో చరణ్‌, తారక్‌లు ఇద్దరూ ప్రాణమిత్రులు. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చేంత స్నేహితులు. కాని ఇద్దరి ఐడియాలజీ వేరు. సినిమా మొదటి నుంచి కూడా ఇద్దరూ దక్షిణ ద్రువం, ఉత్తర ద్రువం అని అన్నట్టు ఉంటారు. వీరిద్దరికి గొడవ అవుతుంది, కొట్టుకుంటారు అని తెలుస్తుంది. సినిమా చూసే వాళ్లంతా వాళ్లిద్దరూ కొట్టుకోకుండా ఉంటే బాగుండు అని అనుకుంటారు. వారిద్దరూ కొట్టుకునేటప్పుడు కొండల్లో రెండు సింహాలు దెబ్బలాడుకుంటున్నట్టు ఉంటుంది. సినిమాలో ఇలాంటి ఫైట్స్ చూసి ఎంజాయ్ చేయాలి కానీ నాకు ఏడుపొచ్చింది. నేను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా రష్‌ ఐదు సార్లు చూశాను. చూసిన ప్రతి సారి వాళ్లిద్దరూ కొట్టుకునే సన్నివేశాల్ని చూసి ఏడ్చేవాడ్ని. ప్రేక్షకులకి కూడా వాళ్లిద్దరూ కొట్టుకుంటుంటే కన్నీళ్లు రావడం ఖాయం” అని అన్నారు.