Vijayendra Prasad: ‘రజాకార్ ఫైల్స్’పై విజయేంద్ర ప్రసాద్ కామెంట్
ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి కథను అందించిన తన సత్తా ఏమిటో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాడు. ఇక ఇప్పుడు తన నెక్ట్స్...

Vijayendra Prasad Confirms About Razakar Files Movie
Vijayendra Prasad: ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి కథను అందించిన తన సత్తా ఏమిటో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాడు. ఇక ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు ఈ స్టార్ రైటర్. అయితే తాజాగా విజయేంద్ర ప్రసాద్ పేరును రాజ్యసభకు కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఆయనకు సినిమా రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలతో పాటు, రాజకీయ నేతలు కూడా విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే విజయేంద్ర ప్రసాద్ నెక్ట్స్ ప్రాజెక్టులు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఇందుకు ముఖ్య కారణం ఆయన త్వరలో తెలంగాణలో జరిగిన రజాకార్ల అఘాయిత్యాలకు సంబంధంచి ‘రజాకార్ ఫైల్స్’ అనే సినిమా కథను రెడీ చేస్తున్నాడట ఈ స్టార్ రైటర్.
Vijayendra Prasad : ఓ వైపు రాజ్యసభకి నామినేట్.. మరో వైపు మూడు సెన్సేషనల్ కథలు..
అయితే తాజాగా ఈ స్టార్ రైటర్ ‘రజాకార్ ఫైల్స్’ కథ గురించి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఈ కథను రెడీ చేసినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. కాగా, తాజాగా విజయేంద్ర ప్రసాద్‌ను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తరుణ్ చుగ్‌లు కలిశారు. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయిన విజయేంద్ర ప్రసాద్‌కు వారు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో రజాకార్ ఫైల్స్ సినిమా గురించి బండి సంజయ్ ఆరా తీయగా, సినిమా కథ రెడీగా ఉందని, త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్తానని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.
Vijayendra Prasad: రజాకార్ ఫైల్స్ రెడీ చేస్తోన్న విజయేంద్ర ప్రసాద్!
మే నెలలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని విజయేంద్ర ప్రసాద్ తెలుపగా.. జనవరి లేదా ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేసేలా చూడాలని బండి సంజయ్ కోరగా.. తప్పకుండా ప్రయత్నిస్తానని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. మొత్తానికి విజయేంద్ర ప్రసాద్ మరోసారి తెలంగాణలో జరిగిన రజాకార్ల అఘాయిత్యాలపై సినిమా చేస్తుండటంతో ఈ మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.