Vikram: బాహుబలి2 రికార్డులకు ఎసరుపెట్టిన విక్రమ్..!

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్....

Vikram: బాహుబలి2 రికార్డులకు ఎసరుపెట్టిన విక్రమ్..!

Vikram To Beat Baahubali2 Lifetime Collections In Tamil Nadu

Vikram: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించగా, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్‌లు కమల్ ఇటీవల కాలంలో చేయకపోవడంతో, ఆయన అభిమానులు ఈ సినిమాను పదేపదే చూసేందుకు ఆసక్తిని కనబరిచారు.

Vikram: విక్రమ్ దెబ్బకు నిద్రలేచిన ఇండియన్!

అయితే వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.300 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. కాగా, తాజాగా ఈ సినిమా మరో అరుదైన రికార్డును తన పేరిట రాసుకునేందుకు రెడీ అవుతోంది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి 2 చిత్ర లైఫ్‌టైం రికార్డును విక్రమ్ అధిగమించేందుకు సిద్ధమయ్యింది. తమిళనాట బాహుబలి 2 లైఫ్‌టైం కలెక్షన్స్ అయిన రూ.155 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసేందుకు విక్రమ్ పరుగులు పెడుతున్నాడు.

Vikram : విక్రమ్ సినిమా.. థియేటర్లో చెలరేగిన మంటలు.. తగలబడిన తెర..

విక్రమ్ చిత్రం కేవలం రెండు వారాల్లోనే తమిళ బాక్సాఫీస్ వద్ద రూ.130 కోట్ల వసూళ్ల కొల్లగొట్టింది. ఇక బాహుబలి లైఫ్‌టైం కలెక్షన్స్ అయిన రూ.155 కోట్ల మార్క్‌ను మరికొద్ది రోజుల్లోనే దాటేయడం విక్రమ్‌కు పెద్ద కష్టమేమీ కాదంటున్నారు తమిళ సినీ ఎక్స్‌పర్ట్స్. కమల్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్‌ల సపోర్టింగ్ యాక్టింగ్ కూడా బాగా హెల్ప్ అయ్యింది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్య రోలెక్స్ పాత్రలో ఎంట్రీ ఇచ్చిన విధానం ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచిందని చెప్పాలి. మరి మున్ముందు విక్రమ్ సినిమా ఇంకా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.