Vikram: విక్రమ్ దెబ్బకు నిద్రలేచిన ఇండియన్!

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించన లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో కమల్ హాసన్ చాలా రోజుల తరువాత.....

Vikram: విక్రమ్ దెబ్బకు నిద్రలేచిన ఇండియన్!

Indian 2 Team Gets Hope From Vikram Effect

Vikram: తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించన లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో కమల్ హాసన్ చాలా రోజుల తరువాత ఇలాంటి సక్సెస్‌ను అందుకోవడంతో ఆయన అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక విక్రమ్ చిత్రం కలెక్షన్ల పరంగా కూడా కమల్ హాసన్ మార్కెట్ ఏ స్థాయిలో ఉందో మరోసారి రుజువు చేసింది. విక్రమ్ దెబ్బతో కమల్ హాసన్‌ను లైట్ తీసుకున్న వారందరూ నిద్ర లేచినట్లయ్యిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Vikram : విక్రమ్ సినిమా.. థియేటర్లో చెలరేగిన మంటలు.. తగలబడిన తెర..

ఇప్పుడు దీన్ని నిజం చేస్తూ ‘ఇండియన్-2’ చిత్ర యూనిట్ కూడా షూటింగ్‌కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలోనే ఇండియన్-2 సినిమాను స్టార్ట్ చేసినా, అనేక కారణాల వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు విక్రమ్ సూపర్ సక్సెస్ కావడంతో, ఇండియన్-2 చిత్ర నిర్మాతలు మళ్లీ తమ సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. కమల్ హాసన్‌తో తమకు ఎలాంటి విభేదాలు లేవని చెబుతూనే, షూటింగ్ కోసం రెడీ అవుతున్నట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Vikram : కమల్ హాసన్ అన్న.. సూర్య తంబి.. స్పెషల్ ట్వీట్..

అయితే దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో RC15 సినిమాను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో ముగించేసుకుని, ఇండియన్-2 సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని ఆయన భావిస్తున్నాడట. అయితే గతంలో ఇండియన్-2 సినిమాలో కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు కాజల్ ఈ సినిమాలో నటిస్తుందా లేక వేరొక హీరోయిన్‌ను తీసుకుంటారా అనేది కూడా సందేహంగా మారింది. మరి ఈ విషయాలన్నింటికీ చిత్ర యూనిట్ నుండి ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.