Attack On Police: పోలీసును గదిలో బందించి దాడి చేసిన గ్రామస్తులు

ఓ వ్యక్తిని కొట్టారన్న నెపంతో పోలీసుపై దాడికి దిగారు స్థానికులు.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని చ్ఛత్తర్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఛత్తర్పూర్ జిల్లా, జాముథాలి గ్రామంలో లాక్ డౌన్ సమయంలోను షాపులు తెరిచి ఉన్నాయంటూ పోలీస్ స్టేషన్ కు ఫోన్ కాల్ వచ్చింది.

Attack On Police: పోలీసును గదిలో బందించి దాడి చేసిన గ్రామస్తులు

Attack On Police (2)

Attack On Police: ఓ వ్యక్తిని కొట్టారన్న నెపంతో పోలీసుపై దాడికి దిగారు స్థానికులు.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని చ్ఛత్తర్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఛత్తర్పూర్ జిల్లా, జాముథాలి గ్రామంలో లాక్ డౌన్ సమయంలోను షాపులు తెరిచి ఉన్నాయంటూ పోలీస్ స్టేషన్ కు ఫోన్ కాల్ వచ్చింది. సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని సమీక్షించేందుకు ఇంద్రేస్, శాంత్ కుమార్ అనే ఇద్దరు పోలీసు అధికారులు గ్రామంలోని హాట్ బజార్ మార్కెట్ వద్దకు వెళ్లారు.

అక్కడ ఓ కూరగాయల వ్యాపారి లాక్ డౌన్ నిబంధనలు తుంగలో తొక్కుతూ షాప్ ను తెరిచివుంచాడు. దీంతో అతడిని షాప్ మూసేయాలని పోలీసులు కోరారు. దానికి వ్యాపారి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీస్ అధికారికి ఇంద్రేస్ కూరగాయలపై వ్యాపారిపై లాఠీ జులిపించాడు. దీంతో వ్యాపారి తలకి గాయమైంది. అది గమనించిన స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగి దాడి చేశారు. ఇంద్రేస్ ను కర్రలతో తీవ్రంగా కొట్టారు. గదిలో బందించి దాడి చేయడంతో అతడు బయటకు వెళ్లలేకపోయారు.

అక్కడ ఉన్నవారు వీడియో తీసి దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయింది. ఇక ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు దర్యాప్తుకు ఆదేశించారు.