Viral Video: పక్షిలా రెక్కల్లేవు కానీ గాల్లో ప్రయాణించిన యువకుడు.. ఎలా సాధ్యమైందంటే?

మనిషి గాల్లో ప్రయాణించడం సాధ్యమేనా? పక్షులు ఎంచక్కా రెక్కల సాయంతో గాల్లో ప్రయాణిస్తూ ఎక్కడకి కావాలంటే అక్కడకి వెళ్లిపోతాయి. మరి మనుషులు ఎలా ఎగురుకుంటూ వెళ్లాలంటే సాధ్యమేనా? అంటే ఎన్నో ఏళ్లుగా ఎందరో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.

Viral Video: పక్షిలా రెక్కల్లేవు కానీ గాల్లో ప్రయాణించిన యువకుడు.. ఎలా సాధ్యమైందంటే?

Viral Video

Viral Video: మనిషి గాల్లో ప్రయాణించడం సాధ్యమేనా? పక్షులు ఎంచక్కా రెక్కల సాయంతో గాల్లో ప్రయాణిస్తూ ఎక్కడకి కావాలంటే అక్కడకి వెళ్లిపోతాయి. మరి మనుషులు ఎలా ఎగురుకుంటూ వెళ్లాలంటే సాధ్యమేనా? అంటే ఎన్నో ఏళ్లుగా ఎందరో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అపుడప్పుడు మనం సైన్స్ ఫిక్షన్ సినిమాలు, సూపర్ హీరోల సినిమాలు చూస్తున్నపుడు అందులో హీరోలు అలా గాల్లో రయ్యి మని దూసుకెళ్తుంటే అబ్బా.. ఇది మనకి సాధ్యమేనా? అంటూ ఆలోచనలు చేస్తుంటాం.

మనిషి గాల్లో ప్రయాణించాలని ఆరాటపడుతుండడంతో కొందరు ఇప్పటికే ఈ దిశగా రకరకాల ప్రయోగాలు మొదలుపెట్టారు. అందులో ఇప్పటికే మనం కొన్ని కొన్ని చూశాం. ఉదాహరణకు పక్షుల మాదిరే మనిషి కూడా భారీ కృత్రిమ రెక్కలు కట్టుకొని వాటి సాయంతో ఎత్తైన పర్వతాల మీద నుండి కిందకి దూకి గాల్లో ప్రయాణించి సురక్షితంగానే దిగారు. అయితే, మరి కిందనుండి ఎత్తిన పర్వతాల మీదకి అలా గాల్లో ఎగురుతూ వెళ్లగలరా? అంటే సాధ్యపడడం లేదు. అలా వెళ్లంటే గాల్లో పీడనం, ఒత్తిడి తెచ్చి పైకి ఎగిరేందుకు వాయువుల సిలిండర్లతో ప్రయత్నాలు జరిగాయి. కానీ అవి సిలిండర్లలో వాయువులు ఉన్నంత వరకే సాధ్యం. మరి మధ్యలో ఆగిపోతే అంతే సంగతులు.

మరి గాల్లో ఎగరడం.. రయ్యి మని దూసుకెళ్లడం ఇంకెలా సాధ్యం అనే ఆలోచనతోనే ఓ యువకుడు ఓ ప్రయోగం చేసి కొంతవరకు సక్సెస్ అయ్యాడు. ఓ యువకుడు హోవర్‌బోర్డు ఉపయోగించి జెట్ స్పీడ్ తో గాల్లో దూసుకెళ్లాడు. హోవర్‌బోర్డు మీదకి ఎక్కిన ఆ యువకుడు భూమి నుంచి 4 అడుగుల ఎత్తులోకి ఎగిరి అక్కడ ముందుకు వెళ్ళాడు. దాన్ని వీడియో తీయించిన అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ తెగ వైరల్ అవుతుంది. ఆ యువకుడు గాల్లో ప్రయాణించింది కొంత దూరమే అయినా ఏదో ఒక రోజు మనిషి గాల్లో ప్రయాణించడం ఖాయమని ధీమా కలిగిస్తుంది.

యువకుడు గాల్లో ప్రయాణించేందుకు ఉపయోగించిన హోవర్‌బోర్డ్ పరికరం రూ.14 లక్షలు కాగా హోవర్‌బోర్డ్‌పై నుండి వ్యక్తి కిందపడితే దెబ్బలు తగలకుండా తలకు హెల్మెట్ పెట్టుకున్నాడు. రెక్స్ చాప్‌మాన్ ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ వీడియోని ఇప్పటికే కోటి 60 లక్షల మంది చూడగా 16వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరు చూసేసి గాల్లో ఎలా వెళ్ళాడో తెలుసుకోండి.