Virat Kohli: ఐపీఎల్‌లో చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)లో ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.ఐపీఎల్‌లో 100వ సారీ కోహ్లి 30 ఫ్ల‌స్ మార్క్‌ను దాటాడు.

Virat Kohli: ఐపీఎల్‌లో చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి

Virat Kohli

Updated On : April 20, 2023 / 6:18 PM IST

Virat Kohli: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)లో ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లి(Virat Kohli) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. మొహాలీ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్(Royal Challengers Bangalore) ఓపెనర్‌గా బ‌రిలోకి దిగిన కోహ్లి.. రాహుల్ చాహ‌ర్ బౌలింగ్‌లో రెండు ప‌రుగులు తీయ‌డం ద్వారా వ్య‌క్తిగ‌త స్కోరు 30 వ‌ద్ద ఓ రికార్డును అందుకున్నాడు. ఐపీఎల్‌లో 100వ సారీ కోహ్లి ’30 ఫ్ల‌స్’ మార్క్‌ను దాటాడు.

ఈ క్ర‌మంలో ఐపీఎల్‌లో ’30 ఫ్ల‌స్’ స్కోరు చేసిన తొలి ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లి 221 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘ‌నత‌ను సాధించాడు. ఆ త‌రువాత శిఖ‌ర్ ధావ‌న్ 209 ఇన్నింగ్స్‌ల్లో 91 సార్లు, డేవిడ్ వార్న‌ర్ 167 ఇన్నింగ్స్‌ల్లో 90 సార్లు, రోహిత్ శ‌ర్మ 227 ఇన్నింగ్స్‌ల్లో 85 సార్లు ’30 ఫ్ల‌స్’ స్కోరు సాధించిన జాబితాలో ఉన్నారు.

IPL 2023, PBKS vs RCB:ధాటిగా ఆడుతున్న ప్ర‌భ్‌సిమ్ర‌న్‌..Live Updates

ఈ మ్యాచ్‌లో కోహ్లి 47 బంతుల‌ను ఎదుర్కొని 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 59 ప‌రుగులు చేశాడు. రెగ్యులర్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పక్కటెముక గాయంతో బాధపడుతుండ‌డంతో ఫీల్డింగ్ చేయ‌క‌పోవ‌డంతో కోహ్లీ ఆర్‌సీబీ స్టాండిన్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. టీమ్ఇండియా సార‌థ్య బాధ్య‌త‌ల‌ను వ‌దిలివేశాక 556 రోజుల త‌రువాత ఇలా ఓ జ‌ట్టును కోహ్లి న‌డిపించే బాధ్య‌త‌ను తీసుకున్నాడు.