Virat Kohli : జిమ్‌లో కోహ్లి వ‌ర్కౌట్లు.. సాకులు వెదుకుతూనే ఉంటారా..? మ‌రింత మెరుగవుతారా..?

టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌, స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లి (Virat Kohli) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆట‌లో ఎన్నో రికార్డులను అత‌డు బ‌ద్ద‌లు కొట్టాడు. ఆట‌తోనే కాకుండా త‌న ఫిట్‌నెస్ తో ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలిచాడు.

Virat Kohli : జిమ్‌లో కోహ్లి వ‌ర్కౌట్లు.. సాకులు వెదుకుతూనే ఉంటారా..?  మ‌రింత మెరుగవుతారా..?

Virat Kohli GYM

Virat Kohli GYM : టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌, స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లి (Virat Kohli) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆట‌లో ఎన్నో రికార్డులను అత‌డు బ‌ద్ద‌లు కొట్టాడు. ఆట‌తోనే కాకుండా త‌న ఫిట్‌నెస్ తో ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలిచాడు. విరాట్ ఫిట్‌నెస్‌పై పెట్టే శ్రద్ద మామూలిది కాదు. ప్ర‌తి రోజులు కొన్ని గంట‌ల పాటు జిమ్‌లో గ‌డుపుతుంటాడు. చాలా మంది ఆట‌గాళ్లు మ్యాచ్ స‌మ‌యాల్లోనే ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇస్తుంటారు. సెల‌వుల్లో పెద్ద‌గా ప‌ట్టించుకోరు. కానీ విరాట్ అలా కాదు.

Virat Kohli : విరాట్ కోహ్లి సంపాద‌న ఎంతో తెలుసా..? మ‌రే క్రికెటర్‌కు కూడా సాధ్యం కాని రీతిలో

ఐపీఎల్, డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్‌ల కార‌ణంగా గ‌త మూడు నెల‌లుగా టీమ్ఇండియా ఆట‌గాళ్లు బిజీగా గ‌డిపారు. విండీస్ ప‌ర్య‌ట‌న‌కు నెల రోజుల విరామం దొరికింది. దీంతో టీమ్ఇండియా ఆట‌గాళ్లు సెల‌వుల‌ను ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ స‌భ్యుల‌తో స‌ర‌దాగా గ‌డుపుతున్నారు. అయితే.. విరాట్ కోహ్లి మాత్రం జిమ్‌లో వ‌ర్కౌట్లు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడిను త‌న సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. సాకులు వెతుకుతూనే ఉంటారా..? లేదంటే మ‌రింత మెరుగు అవుతారా..? అంటూ ఆ వీడియోకి క్యాప్ష‌న్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Ashes 2023 : స్టీవ్ స్మిత్‌ను అవ‌మానించిన ఇంగ్లాండ్ అభిమానులు.. ‘నువ్వు ఏడుస్తుంటే మేము టీవీల్లో చూశాం’..

 

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

ఇదిలా ఉంటే.. ఈ నెల చివ‌రి వారంలో టీమ్ఇండియా వెస్టిండీస్‌కు బ‌య‌లుదేర‌నుంది. విండీస్ జ‌ట్టుతో రెండు టెస్టులు, మూడు వ‌న్డేలు, ఐదు టీ20లు ఆడ‌నుంది.

వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఇదే..

టెస్టు సిరీస్‌

– జూలై 12 నుంచి 16 వ‌ర‌కు మొద‌టి టెస్టు
– జూలై 20 నుంచి 24 వ‌ర‌కు రెండో టెస్టు

వన్డే సిరీస్

– జూలై 27న తొలి వన్డే
– జూలై 29న‌ రెండో వన్డే
– ఆగ‌స్టు 1న మూడో వన్డే

టి20 సిరీస్

– ఆగ‌స్టు 3న‌ తొలి టి20
– ఆగస్టు 6న‌ రెండో టి20
– ఆగస్టు 8న మూడో టి20
– ఆగస్టు 12న నాలుగో టి20
– ఆగస్ట్ 13న ఐదో టి20