Virat Kohli: గంభీర్‌తో గొడవ.. మరుసటి రోజు భార్యతో కలిసి విరాట్ ఏం చేశాడంటే..?
గౌతమ్ గంభీర్‌తో గొడవ జరిగిన మరుసటి రోజే విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మతో కలిసి గుడికి వెళ్లాడు. ఎప్పుడు సమయం దొరికినా వీరిద్దరు ఆధ్మాతిక యాత్రకు వెలుతుంటారు.

Virat Kohli Visits Temple
Virat Kohli: కింగ్ కోహ్లి మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో అందరికి తెలిసిందే. అయితే గ్రౌండ్ వెలుపల మాత్రం ప్రశాంతంగా ఉంటాడని అతడిని దగ్గర నుంచి చూసిన వాళ్లు చెబుతుంటారు. ఆ సంగతి కాస్త పక్కన బెడితే విరాట్(Virat Kohli )కు ఆధ్మాత్మిక చింతన ఎక్కువ. ఎప్పుడు సమయం దొరికినా సరే తన భార్య అనుష్క శర్మ(Anushka Sharma)తో కలిసి ఆలయాలకు వెలుతుంటాడు.
IPL 2023, SRH vs KKR: ఇటు హైదరాబాద్ అటు కోల్‌కతా.. రెండింటికి డూ ఆర్ డై.. వరుణుడు ఏం చేస్తాడో..?
ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్నాడు. మే 1 సోమవారం లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆర్‌సీబీ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ గంభీర్, కోహ్లి ల మధ్య వాగ్వాదం నడిచింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఈ సంగతులను కాస్త పక్కన బెడితే గొడవ జరిగిన మరుసటి రోజే అంటే మే 2 మంగళవారం విరాట్ తన సతీమణి అనుష్కతో కలిసి స్థానికంగా ఉన్న ఓ గుడికి వెళ్లారు.
View this post on Instagram
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కోహ్లి ధోతి ధరించి కనిపించగా, అనుష్క పింక్ శారీలో గుడిలోకి వెళ్లింది. అంతకుముందు మార్చిలో విరుష్క దంపతులు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. శివలింగానికి పాలభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Virat Kohli : గంభీర్‌తో గొడవపై స్పందించిన కోహ్లీ..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడగా ఐదు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఆర్‌సీబీ తన తదుపరి మ్యాచ్‌ను ఢిల్లీతో మే6న ఆడనుంది.