Vishnu Vishal : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో విష్ణు విశాల్, గుత్తా జ్వాలా

తాజాగా తమిళ హీరో విష్ణు విశాల్, ఆమె వైఫ్, ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ GHMC పార్క్ లో వీరిద్దరూ కలిసి........

Vishnu Vishal :  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో విష్ణు విశాల్, గుత్తా జ్వాలా

Vishnu Vishal (1) (1)

Green India Challenge :   రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా చాలా మంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా తమిళ హీరో విష్ణు విశాల్, ఆమె వైఫ్, ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ GHMC పార్క్ లో వీరిద్దరూ కలిసి మొక్కలు నాటారు.

 

ఈ సందర్భంగా విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ”పర్యవరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ కి అభినందనలు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే ఆవకాశం కల్పించినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొనాలి” అని తెలిపారు.

RJ Kajal :: ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో.. RJ కాజల్‌కి కౌంటర్ ఇచ్చిన వరుణ్ సందేశ్..

ఆ తర్వాత హీరో రవితేజ, డైరెక్టర్ మను ఆనంద్ కి విష్ణు విశాల్ గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు. కార్యక్రమం అనంతరం విష్ణు విశాల్,గుత్తాజ్వాల కి గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ ‘వృక్షవేదం’ పుస్తకాన్ని బహుకరించారు. విష్ణు విశాల్ నటించిన FIR సినిమా తమిళ్, తెలుగులో ఫిబ్రవరి 11న రిలీజ్ అవ్వనుంది.