Das Ka Dhamki – Trailer 2.0 : దాస్ కా ధమ్కీ ట్రైలర్ రిలీజ్.. విశ్వక్సేన్ ఆ సినిమాలకు మాస్ వర్షన్ యాడ్ చేశాడా??

గతంలో ఆల్రెడీ దాస్ కా ధమ్కీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు మరోసారి దాస్ కా ధమ్కీ ట్రైలర్ 2.0 అని మరో ట్రైలర్ రిలీజ్ చేశారు. నేడు దాస్ కా ధమ్కీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని కరీంనగర్‌లోని మార్క్ఫెడ్ గ్రౌండ్ లో గ్రాండ్ గా నిర్వహించారు.............

Das Ka Dhamki – Trailer 2.0 : దాస్ కా ధమ్కీ ట్రైలర్ రిలీజ్.. విశ్వక్సేన్ ఆ సినిమాలకు మాస్ వర్షన్ యాడ్ చేశాడా??

Vishwaksen Das Ka Dhamki - Trailer 2.0 released

Das Ka Dhamki – Trailer 2.0 :  మంచి విజయాలతో దూసుకుపోతున్న యువ హీరోలలో విశ్వక్సేన్ ఒకరు. తక్కువ సినిమాలతోనే తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. విశ్వక్ గత సినిమా ఓరి దేవుడా పర్వాలేదనిపించింది. ఇప్పుడు దాస్ కా ధమ్కీ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పలుసార్లు వాయిదా పడింది. ఇటీవలే దాస్ కా ధమ్కీ సినిమాని మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. తాజాగా నేడు దాస్ కా ధమ్కీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని కరీంనగర్‌లోని మార్క్ఫెడ్ గ్రౌండ్ లో గ్రాండ్ గా నిర్వహించారు.

గతంలో ఆల్రెడీ దాస్ కా ధమ్కీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు మరోసారి దాస్ కా ధమ్కీ ట్రైలర్ 2.0 అని మరో ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే.. హీరో డ్యూయల్ రోల్ అని తెలిసిపోతుంది. ఒక హీరో చనిపోతే ఆ హీరో ప్లేస్ లోకి ఇంకొకరు వచ్చే క్యారెక్టర్. ఇప్పటికే ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చాయి. ఇక ట్రైలర్ లో.. సంజయ్ రుద్రా అనే క్యారెక్టర్ బాగా డబ్బున్నవాడు, చదువుకున్నవాడు. క్యాన్సర్ లేని సమాజాన్ని నిర్మించాలని ఓ ఫార్మా హెడ్ గా దానికోసం పనిచేస్తాడు. అయితే విలన్స్ హీరోకి యాక్సిడెంట్ చేయించడంతో రెండో హీరో రంగంలోకి దిగుతాడు. ఓ హోటల్ లో వెయిటర్ గా పనిచేసే మాస్ క్యారెక్టర్ కృష్ణ దాస్ సంజయ్ ప్లేస్ లోకి వచ్చాక అతను ఏం చేస్తాడు? ఆ డబ్బంతా చూసి ఉంటాడా? సంజయ్ కలలని నెరవేరుస్తాడా? సంజయ్ చనిపోతాడా లేక బతికే ఉంటాడా? విలన్లతో దాస్ ఎలా పోరాడతాడు అనేది చూపించాడు.

Naatu Naatu Song : నాటు నాటు తో పాటు ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచిన పాటలు ఇవే.. మీరు కూడా ఒకసారి వినేయండి..

హీరోయిన్ గా నివేదా పేతురాజ్ నటించింది. ఇప్పటికే సినిమాలోని సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి. కామెడీ సీన్స్, మాస్ సీన్స్, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి విశ్వక్సేన్ స్వయంగా దర్శకత్వం వహించి నిర్మిస్తుండటంతో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. దాస్ కా ధమ్కీ ట్రైలర్ చూస్తుంటే నాని జెంటిల్ మెన్, గోపీచంద్ గౌతమ్ నంద సినిమాలు గుర్తొస్తాయి. కాకపోతే దానికి విశ్వక్ స్టైల్ మాస్ వర్షన్ యాడ్ చేసినట్టు ఉంటుంది. మరి సినిమాలో కూడా ఇలాగే ఉంటుందా లేక కొత్తగా ఏమైనా చూపిస్తాడా తెలియాలంటే మార్చ్ 22 దాకా వెయిట్ చేయాల్సిందే.