లాక్ డౌన్ 3.0 : కరోనాకు చెక్ పెట్టాలంటే ప్రజల సహకారం తప్పనిసరి : కిషన్ రెడ్డి

  • Published By: madhu ,Published On : May 1, 2020 / 02:06 PM IST
లాక్ డౌన్ 3.0 : కరోనాకు చెక్ పెట్టాలంటే ప్రజల సహకారం తప్పనిసరి : కిషన్ రెడ్డి

కరోనా వైరస్ కు చెక్ పెట్టాలంటే..కట్టడి చేయాలంటే..ప్రజల సహకారం తప్పనిసరి..సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ..మాస్క్ లు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. కంటైన్ మెంట్ జోన్లు తప్పించి..మిగతా ప్రాంతాల్లో మినహాయింపులు ఇచ్చామన్నారు. కరోనాపై దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి యుద్ధం చేయాల్సిందేనని పిలుపునిచ్చారు.

ప్రస్తుతం వైరస్ కారణంగా ఆర్థికపరమైన అంశాలపై కేంద్రం ఆలోచిస్తోందన్నారు. మానవీయకోణంలో ఆలోచించి వలస కార్మికులను తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మే 03వ తేదీ వరకు కొనసాగనున్న లాక్ డౌన్ ను..మూడోసారి కొనసాగించింది కేంద్రం.

2020, మే 01వ తేదీ శుక్రవారం సాయంత్రం కేంద్రం నిర్ణయాన్ని వెల్లడించింది. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్దితో 10tv మాట్లాడింది. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 

కరోనా వైరస్ కారణంగా కేంద్రం కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటోందని, 21 రోజుల తర్వాత కొత్తగా కేసులు రాకపోతే..జోన్లను మారుస్తామన్నారు. లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్న ప్రాంతంలోనే కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ఆయన.. విదేశాల్లో చిక్కుకున్న వారిని భారతదేశానికి తీసుకొచ్చే ఆలోచన లేదన్నారు.

ఇప్పటికే అన్ని పరిశ్రమలకు అనుమతినిచ్చామని, భవన నిర్మాణాలు, ప్రాజెక్టులకు అనుమతినిచ్చామని వెల్లడించారు. అన్ని రకాల పరిశ్రమలకు (రెడ్ జోన్ తప్పించి) అనుమతినిచ్చామని..పరిశ్రమల్లో తక్కువ సిబ్బందితో..సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. స్వస్థలాలకు వెళ్లే కార్మికులు..అధికారుల వద్ద పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. ప్రపంచదేశాలతో చూస్తే..భారతదేశం మెరుగైన స్థితిలో ఉందన్నారు. కంటైన్ మెంట్ జోన్లలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తామన్నారు 

విద్యారంగంపై కూడ ఆయన స్పందించారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో విద్యపై పలు రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకున్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. విద్యార్థులు..వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సినవసరం లేదని భరోసా ఇచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.