Vijay : బీస్ట్ సినిమా చూడండి.. లీటర్ పెట్రోల్ ఫ్రీగా పొందండి..

బీస్ట్ మూవీ రిలీజ్ అవుతుండటంతో తమిళనాడు చెన్నైలోని ఓ రెండు థియేటర్లు ఈ స్పెషల్ ఆఫర్ ని ప్రకటించాయి. చెన్నైలోని రాజా లక్ష్మీ, అమ్రితారాజ్‌ థియేటర్లు బీస్ట్ సినిమా చూసిన వారికి......

Vijay : బీస్ట్ సినిమా చూడండి.. లీటర్ పెట్రోల్ ఫ్రీగా పొందండి..

Beast

Beast :  తమిళ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘బీస్ట్’ సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తుంది. తమిళనాడులో థియేటర్ల వద్ద విజయ్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఉదయం నుంచే థియేటర్ల వద్ద అభిమానులు సినిమా చూడటానికి లైన్లలో నించున్నారు. తమిళనాడులో బీస్ట్ సినిమా చూసిన వారికి ఓ స్పెషల్ ఆఫర్ ని ప్రకటించారు.

బీస్ట్ మూవీ రిలీజ్ అవుతుండటంతో తమిళనాడు చెన్నైలోని ఓ రెండు థియేటర్లు ఈ స్పెషల్ ఆఫర్ ని ప్రకటించాయి. చెన్నైలోని రాజా లక్ష్మీ, అమ్రితారాజ్‌ థియేటర్లు బీస్ట్ సినిమా చూసిన వారికి ఒక లీటరు పెట్రోల్‌ ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించాయి. అయితే ఓ కండిషన్‌ కూడా పెట్టారు. కేవలం ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో కోసం ఎవరైతే 5 టికెట్లు కొంటారో వారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపారు. ఈ థియేటర్లో ఫస్ట్‌ షోను ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రదర్శించారు. ఈ థియేటర్స్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ ధర 500 ఉంది. ఈ రేటుతో కనీసం అయిదు టికెట్స్ కొన్నవారికి లీటర్ పెట్రోల్ ఇస్తామని ప్రకటించారు. అయితే స్టార్ హీరో సినిమా కావడంతో మొదటి రోజు మొదటి ఆట అన్ని టికెట్లు సేల్ అయిపోయి హౌస్ ఫుల్ అయింది. దీంతో చాలా మంది ఈ ఆఫర్ ని వాడుకొని పెట్రోల్ తీసుకెళ్లారు.

Seetha Ramam : మైనస్ 25 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్.. రిస్క్ చేస్తున్న దుల్కర్, హను..

అయితే చెన్నైలో మరి కొన్ని థియేటర్ల వద్ద కూడా విజయ్ అభిమానులు ఆయన పార్టీ మక్కళ్‌ ఇయ్యక్కం తరపున సినిమా చూసిన ప్రేక్షకులకు లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తున్నారు. ఇటీవల్ పెట్రోల్ రేటు మళ్ళీ పెరగడంతో ఇలా విజయ్ అభిమానులు సినిమా చూసిన వారికి పెట్రోల్ ఇవ్వడం వైరల్ గా మారింది.