Seetha Ramam : మైనస్ 25 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్.. రిస్క్ చేస్తున్న దుల్కర్, హను..

ఈ సినిమాలోని కొన్ని ఆర్మీ సన్నివేశాలను అత్యంత కఠినమైన ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని హిక్కిం అనే గ్రామంలో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఈ ప్రాంతం సముద్ర......

Seetha Ramam : మైనస్ 25 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్.. రిస్క్ చేస్తున్న దుల్కర్, హను..

Seeth Ramam

 

Seetha Ramam :  హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ‘సీతా రామం’ అనే సినిమా తెరకెక్కుతుంది. ఇందులో రష్మిక మందన్నా ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ఆర్మీ, ప్రేమ భావోద్వేగాలతో ఉండబోతుంది. ‘సీతా రామం’ సినిమాని వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై స్వప్నాదత్ నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాలోని కొన్ని ఆర్మీ సన్నివేశాలను అత్యంత కఠినమైన ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని హిక్కిం అనే గ్రామంలో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 440 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంతే కాక అక్కడ ఉష్ణోగ్రత మైనస్ 25 డిగ్రీలు ఉంటుంది. ఇలాంటి ప్రదేశాల్లో షూటింగ్ చేస్తున్నారంటే సాహసమే అని చెప్పొచ్చు.

Ali : మా ఫ్యామిలిలో తనే ఫస్ట్.. కూతురిపై ఎమోషనల్ పోస్ట్ చేసిన కమెడియన్ అలీ..

దుల్కర్ సల్మాన్, మరి కొంతమందితో ఆర్మీ బ్యాక్ డ్రాప్ సన్నివేశాల్ని హను రాఘవపూడి ఇంత చలిలో షూట్ చేశారంట. సినిమా కోసం వీరిద్దరూ బాగా రిస్క్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇక ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దుల్కర్ మొదటి సారిగా డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తుండటం, రష్మిక ప్రధాన పాత్ర పోషించడం, ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్, గ్లింప్స్ అన్ని కూడా ప్రేక్షకులని ఆకట్టుకోవడంతో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.