చీర వద్దు..చడ్డీలు వేసుకో మమత : బెంగాల్ బీజేపీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు

ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ అధికారి తృణ‌మూల్ కాంగ్రెస్‌, ప్ర‌తిప‌క్ష బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం ముదురుతోంది. తాజాగా ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్..సీఎం మ‌మ‌త‌ కాలి గాయాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

చీర వద్దు..చడ్డీలు వేసుకో మమత : బెంగాల్ బీజేపీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Wear Bermudas Row Over Dilip Ghoshs Latest Attack On Mamata Banerjee

Wear Bermudas ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ అధికారి తృణ‌మూల్ కాంగ్రెస్‌, ప్ర‌తిప‌క్ష బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం ముదురుతోంది. తాజాగా ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్..సీఎం మ‌మ‌త‌ కాలి గాయాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఆయ‌న‌పై ఫైర్ అవుతున్నారు

అసలు దిలీప్ ఘోష్ ఏమన్నారు
మంగళవారం(మార్చి-24,2021) పురూలియాలో జ‌రిగిన ఎన్నిక‌ల ర్యాలీలో బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ మమత కాలి గాయం గురించి మాట్లాడుతూ..ప్లాస్టర్ కత్తిరించబడింది మరియు తరువాత ఒక ముడతల కట్టు ఉంచారు. ఇప్పుడు మ‌మ‌త త‌న విరిగిన కాలిని అందరికీ చూపిస్తోంది. ఆమె చీర కట్టుకుంటుంది కానీ ఆమె తన ఒక కాలుని అందరికీ చూపిస్తోంది. ఒక కాలు క‌నిపించి, మ‌రో కాలు క‌నిపించ‌కుండా ఆమె చీర క‌ట్టుకుంటున్నారు. నేనెప్పుడూ ఇలా చీర క‌ట్టుకోవ‌డం చూడ‌లేదు. మమత తన కాళ్లను అందరికీ చూపించాలనుకుంటే చీర ఎందుకు క‌ట్టుకోవ‌డం? చెడ్డీలు వేసుకుంటే అంద‌రికీ బాగా స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది క‌దా అని దిలీప్ ఘోష్ అన్నారు.

దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై ఫైర్ అవుతున్నారు. మరోవైపు, టీఎంసీ నేతలు కూడా దిలీప్ ఘోష్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిలీప్ ఘోష్ ఓ పర్వర్ట్ అని టీఎంసీ ఎంపీ మ‌హువా మోయిత్రా కామెంట్ చేశారు. ఇలాంటి వికృత నీచమైన కోతులు తాము బెంగాల్ లో విజయం సాధిస్తాం అని అనుకుంటున్నారు అని మహువా మోయిత్రా ట్వీట్ చేశారు.

బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పాత్ర కేవలం విషం-ఉమ్మివేయడానికి తగ్గించబడింది. బెంగాల్ ముఖ్యమంత్రిపై తీవ్రమైన దాడుల నుండి తృణముల్ కార్యకర్తలపై హింస వరకు దిలీప్ ఘోష్ సౌకర్యవంతంగా అన్ని పరిమితులను దాటాడు. మరోసారి షాకింగ్ పదాలు అంటూ మరో టీఎంసీ ఎంపీ కకోలి ఘోష్ దస్తీదార్ ట్వీట్ చేశారు.

కాగా,ఈనెల ప్రారంభంలో నందిగ్రామ్ లో జరిగిన తోపులాటలో మమత కాలికి గాయం అయిన విషయం తెలిసిందే. కాలి గాయం కారణంగా చక్రాల కుర్చీలో కూర్చొనే ఆమె ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు.