Amritpal singh: 80,000 మంది పోలీసులు ఏం చేస్తున్నారు? అమృతపాల్ సింగ్ కేసుపై పంజాబ్ ప్రభుత్వాన్ని గద్దించిన హైకోర్టు

అమృతపాల్ సింగ్ అనుచరుల్లో నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే వారి నుంచి అమృతపాల్ సింగ్‭కు సంబంధించిన ఎలాంటి సమాచారం రావడం లేదు. ప్రస్తుతం ఈ నలుగురు అస్సాంలోని డిబ్రూఘర్‭లో పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా, అందులో ఒకరిని పంజాబ్ రప్పించి విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది

Amritpal singh: 80,000 మంది పోలీసులు ఏం చేస్తున్నారు? అమృతపాల్ సింగ్ కేసుపై పంజాబ్ ప్రభుత్వాన్ని గద్దించిన హైకోర్టు

'What are 80k cops doing?' Court slams Punjab govt over Amritpal singh

Amritpal singh: ఖలిస్తాన్ లీడర్, పంజాబ్ వారిస్ దే చీఫ్ అమృతపాల్ సింగ్‭ను నాలుగు రోజులైనా పట్టుకోకపోవడంపై పంజాబ్ ప్రభుత్వాన్ని పంజాబ్&హర్యానా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 80,000 మంది పోలీసులు ఉండి ఏం చేస్తున్నారంటూ మాన్ ప్రభుత్వాన్ని గద్దించింది. అమృపాల్ సింగ్ ఎలా తప్పించుకున్నాడని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇంటెలిజెన్స్ పూర్తిగా విఫలమైందని కోర్టు పేర్కొంది. రాష్ట్రంలో పరిస్థితులు రోజు రోజుకీ దిగజారుతున్నాయని, అయితే ప్రభుత్వం మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిందనే విమర్శల నేపథ్యంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

Amritpal Singh: అమృత్‌పాల్ సింగ్ పంజాబ్ నుంచి పారిపోయాడా? పాక్, నేపాల్ సరిహద్దుల్లో అలర్ట్ ..

కాగా, అమృతపాల్ సింగ్ అనుచరుల్లో నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే వారి నుంచి అమృతపాల్ సింగ్‭కు సంబంధించిన ఎలాంటి సమాచారం రావడం లేదు. ప్రస్తుతం ఈ నలుగురు అస్సాంలోని డిబ్రూఘర్‭లో పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా, అందులో ఒకరిని పంజాబ్ రప్పించి విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక కేంద్ర భద్రతా సంస్థలు ఇచ్చిన ఆధారాల ప్రకారం.. ఐఎస్ఐ లింకుల కోణంలో సైతం విచారణ సాగుతోందట. ఇక తాజాగా అమృతపాల్ కుటుంబీకుడు ఒకాయనతో పాటు డ్రైవర్ తాజాగా పోలీసుల ముందు లొంగిపోయారు. అయితే వారి దగ్గర కూడా సరైన సమాచారం లభిచంలేదు. అమృతపాల్ సింగ్ అనుచరులైన కుల్వంత్ సింగ్, గుర్ ఔజ్లా అనే మరో ఇద్దరి మీద ఎన్ఎస్ఏ కేసులు నమోదు చేసింది. వారిని సైతం అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.