WhatsApp Trick : వాట్సాప్‌ ట్రిక్స్.. సెకన్లలోనే మీ చాట్స్ ఇలా హైడ్ చేయొచ్చు తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

WhatsApp Trick : మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ మీ చాట్‌లను హైడ్ చేసేందుకు అనేక మార్గాలను అందిస్తుంది. వాట్సాప్ చాట్‌లను సెకన్లలో హైడ్ చేసేందుకు 2 సాధారణ మార్గాలను ఓసారి ట్రై చేయండి.

WhatsApp Trick : వాట్సాప్‌ ట్రిక్స్.. సెకన్లలోనే మీ చాట్స్ ఇలా హైడ్ చేయొచ్చు తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

WhatsApp Trick _ 2 ways to hide your chats within seconds

WhatsApp Trick to hide your chats within seconds : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) తమ యూజర్ల కోసం అనేక ఫీచర్లను అందిస్తోంది. వాట్సాప్ కాలక్రమేణా మరిన్ని ఉపయోగకరమైన ఫీచర్లను యాడ్ చేస్తోంది. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ప్రస్తుతం మీ చాట్‌లను హైడ్ చేసేందుకు అనేక మార్గాలను అందిస్తోంది. ఇప్పటికే చాట్ లాక్ ఫీచర్‌ ఒకటి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ చాట్‌లను హైడ్ చేయడానికి అనుమతించడమే కాకుండా నిర్దిష్ట చాట్‌కి అదనపు లాక్‌ని యాడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ చాట్‌లను హైడ్ చేసేందుకు ఆర్కైవ్ ఆప్షన్ కూడా ఉపయోగించవచ్చు. వాట్సాప్ చాట్‌లను సెకన్లలో హైడ్ చేసేందుకు ఇలా ఓసారి ట్రై చేయండి.

వాట్సాప్ చాట్‌లను సెకన్లలో హైడ్ చేయడం ఎలా? :
వాట్సాప్ యూజర్ల అందరి కోసం ఇటీవల కొత్తగా చాట్ లాక్ ఫీచర్ తీసుకొచ్చింది. మీ సూపర్ పర్సనల్ చాట్‌లకు అదనపు లాక్‌ని యాడ్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, iOS రెండింటికీ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ మీ నోటిఫికేషన్‌లను ఆటోమాటిక్‌గా సైలెంట్ చేస్తుంది. లాక్ చేసిన చాట్ నుంచి కొత్త మెసేజ్ వచ్చిందని మీకు తెలియజేస్తుంది.

* ఏదైనా చాట్‌కి వెళ్లండి > ప్రొఫైల్‌ని విజిట్ చేయండి> Chat Lockపై Tap చేసేందుకు కిందికి స్క్రోల్ చేయండి.
* ఫింగర్ ఫ్రింట్ ఈ చాట్‌ని లాక్ చేయి లేదా Face IDతో ఈ Chat lockపై నొక్కండి.

Read Also : OnePlus 12 Launch Time : వన్‌ప్లస్ 12 ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ కీలక ఫీచర్లు లీక్.. లాంచ్ డేట్ ఎప్పుడో తెలిసిందోచ్.. పూర్తి వివరాలు మీకోసం..!

Note : మీరు వాట్సాప్ మెయిన్ పేజీలో కనిపించే లాక్ చాట్‌ల ఫోల్డర్‌లో మీ వ్యక్తిగత చాట్‌లను చూడవచ్చు. ఈ ఫోల్డర్‌ని చెక్ చేయడానికి మీరు చాట్‌లను కిందికి స్ర్కోల్ చేయాలి. మీ ఫోన్‌లో యూజర్ల ఫింగర్ ఫ్రింట్ రిజిస్టర్ చేసుకుంటే మీ చాట్‌లను ఎవరు యాక్సెస్ చేయలేరు.

WhatsApp Trick _ 2 ways to hide your chats within seconds

WhatsApp Trick _ 2 ways to hide your chats within seconds

చాట్‌లను హైడ్ చేసే మరో మార్గం ఆర్కైవ్ ఆప్షన్ :
* వాట్సాప్‌ని ఓపెన్ చేసి.. ఏదైనా చాట్‌లో Long Press నొక్కండి.
* టాప్ రైట్ కార్నర్‌లో ఉంచిన Archive ఐకాన్‌పై నొక్కండి. ఐకాన్ కిందికి బాణంతో కూడిన Box కలిగి ఉంది.

Note : పైన పేర్కొన్న దశలను అనుసరించిన తర్వాత మీ చాట్‌లు హైడ్ అవుతాయి. అలా హైడ్ అయిన చాట్‌లు అన్ని చాట్‌ల పైనా లేదా ఆర్కైవ్ ఫోల్డర్‌లో చివరిలో కనిపిస్తాయి. మీరు ఈ ఫోల్డర్‌ను ఎగువన వద్దనుకుంటే… Settings > Chats > ’Keep Chats archived‘ని off చేయవచ్చు.

మీరు ఆ ఫోల్డర్ నుంచి మెసేజ్ స్వీకరించినట్లయితే.. ఆ యూజర్ చాట్ ఎగువన పాపప్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ తాత్కాలిక ప్రాతిపదికన చాట్‌లను హైడ్ చేయాలనుకునే వారికి మాత్రమే. మీరు ‘Keep Chats archived‘ ఆప్షన్ ఆన్ చేస్తే.. మీ చాట్‌లు హైడ్ అవుతాయి. కానీ ఫోల్డర్ టాప్‌లో కనిపిస్తుంది. తమ చాట్‌లు ఎగువన కనిపించకూడదనుకునే యూజర్లు పైన పేర్కొన్న చాట్ లాక్ ఫీచర్‌ని ఉపయోగించవచ్చు. లాక్ చేసిన చాట్ నుంచి మీకు మెసేజ్ వచ్చినప్పటికీ, మీ ఫోన్ ఉన్న ఎవరైనా లాక్ కారణంగా చదవలేరు. చాట్ లాక్ ఫీచర్ మీ నోటిఫికేషన్‌లను ఆటోమాటిక్‌గా హైడ్ అవుతుంది.

Tip : మీకు ప్రైవసీ సమస్యలు ఉంటే.. మీ వాట్సాప్ యాప్‌కి ఫింగర్ ఫ్రింట్ లాక్‌ని యాడ్ చేయొచ్చు. యాప్ Settings > privacy సెక్షన్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

Read Also : OnePlus 12 Launch Time : వన్‌ప్లస్ 12 ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ కీలక ఫీచర్లు లీక్.. లాంచ్ డేట్ ఎప్పుడో తెలిసిందోచ్.. పూర్తి వివరాలు మీకోసం..!