Sexual Harassments In Indian Sports: భారత క్రీడారంగాన్ని కుదిపేస్తున్న లైంగిక ఆరోపణలు.. వేధింపుల వల్లే టాలెంటెడ్ ప్లేయర్లు రాణించలేకపోతున్నారా?

భారత క్రీడారంగాన్ని లైంగిక ఆరోపణలు కుదిపేస్తున్నాయి.. వేధింపుల వల్లే టాలెంటెడ్ ప్లేయర్లు రాణించలేకపోతున్నారా? అనేలా తయారైంది పరిస్థితి. ఇది ఏ ఒక్క క్రీడలోనో కాదు దాదాపు అన్ని క్రీడల్లో ఇటువంటి ఆరోపణలువస్తునే ఉన్నాయి. అత్యుత్తమ ప్రతిభ ఇటువంటి ఘోరమైన వేధింపుల వల్ల భారత్ వెనుకబడిపోతోందా?అనే ఆందోళన కలుగుతోంది. బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, ప్రతిభ కలిగిన రెజ్లర్లకు అన్యాయం జరుగుతుందని వెంటనే అతన్ని డబ్ల్యూఎఫ్ఐ నుంచి తొలగించాలని రెజ్లర్లు జంతర్ మంతర్ వద్దధర్నాను కొనసాగిస్తున్నారు అంటే లైంగిక ఆరోపణలు ఏస్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

Sexual Harassments In Indian Sports: భారత క్రీడారంగాన్ని కుదిపేస్తున్న లైంగిక ఆరోపణలు.. వేధింపుల వల్లే టాలెంటెడ్ ప్లేయర్లు రాణించలేకపోతున్నారా?

Sexual Harassments In Indian Sports

Sexual Harass Indian Sports: ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా అవతరించిన భారత్ కు యువశక్తికి కొదవలేదు. ప్రతిభాపాటవాలకు కొదవలేదు. ఆటగాళ్లకు కొదువ లేదు. అయినా సరే..క్రీడల్లో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ పెద్దగా సాధించిందేమీ లేదు. పతకాల పట్టికలో మన దేశం పేరు పాతాళంలో ఉంటుంది. ఎప్పుడో ఓసారి..అప్పుడప్పుడు భారత్ ప్లేయర్ల మెరుస్తుంటారు. మెడల్స్ తెస్తుంటారు. ఆపాటికే దేశమంతా ఉప్పొంగిపోతుంది. ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీలు జరిగినప్పుడు.. ఒక్కటన్నా గోల్డ్‌ మెడల్‌ భారత్‌కు వస్తుందా .. అని ఎదురుచూడటం తప్ప.. దశాబ్దాలుగా మనం చేసిందేమీ లేదు. క్రికెట్, బ్యాడ్మింటన్ లాంటి స్పోర్ట్స్‌లో తప్ప మిగతా ఆటల్లో సత్తా చాటలేకపోతున్నాం. ఇందుకు దేశ క్రీడా వ్యవస్థలో ఉన్న లోపాలే కారణమా? లేక.. లైంగిక వేధింపులే.. టాలెంటెడ్ ప్లేయర్లను వెనక్కి లాగేస్తున్నాయా?

ఇన్నాళ్లూ.. ఈ సమస్య గురించి పెద్దగా చర్చ జరగలేదు. లైంగిక వేధింపులు, ఆరోపణలను కూడా పూర్తిస్థాయిలో పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే పరిస్థితులు ఇప్పుడలా లేవు. లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఇండియన్ స్పోర్ట్స్‌ని కుదిపేస్తున్నాయ్. క్రికెట్ నుంచి రెజ్లింగ్ దాకా.. ఆట ఏదైనా.. పదే.. పదే.. అవే ఆరోపణలు అవే వినిపిస్తున్నాయ్. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్.. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్.. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. టాప్‌ రెజ్లర్లు ఆందోళనకు దిగడం దేశమంతటా హాట్‌ టాపిక్ అయ్యింది. భారత రెజ్లింగ్ సమాఖ్యకు వ్యతిరేకంగా.. రెజ్లర్ల నిరసన కొనసాగుతోంది. వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియా, రవి దహియా, సాక్షి మాలిక్ లాంటి పాపులర్ అథ్లెట్లతో పాటు ఇతర స్టార్ రెజ్లర్లు చేసిన ఆరోపణలు.. క్రీడా సమాఖ్యను కుదిపేస్తున్నాయ్. WFI అధ్యక్ష పదవికి.. బ్రిజ్ భూషణ్ రాజీనామా చేయాలని.. మహిళా రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. రెజ్లింగ్ ఫెడరేషన్‌ని రద్దు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు.

Wrestler protest: రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న బ్రిజ్ భూషణ్.. IOAని ఆశ్రయించిన రెజ్లర్లు

నిజానికి.. లైంగికపరమైన వేధింపులకు సంబంధించిన ఆరోపణలు.. కొన్నేళ్లుగా భారత క్రీడల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయ్. అన్ని ఆటల్లో.. వేధింపులు, బెదిరింపులు సహజంగా ఉంటున్నా.. అవేవీ పెద్దగా బయటకు రావట్లేదు. మహిళా టీమ్‌ల విషయానికొచ్చేసరికి.. లోలోపల ఈ లైంగిక వేధింపులు పెరిగిపోయాయ్. కానీ.. చాలా మంది కెరీర్ కోసమో, స్పోర్ట్స్‌లో ఎదగాలన్న ఆశయంతోనే.. వాటిని భరిస్తూ.. బయటకు చెప్పడం లేదు. కొందరు మాత్రం వేధింపులు తాళలేక.. ధైర్యంగా ఇలాంటి వాటిని బయటపెడుతున్నారు. న్యాయం కోసం పోరాడుతున్నారు. టీమ్‌లోకి సెలక్ట్ చేయాలంటే.. సెక్సువల్ ఫేవర్ చేయాలనే కల్చర్.. మొత్తం క్రీడా రంగాన్నే నాశనం చేస్తోంది. చాలా వరకు ఈ ఆరోపణలు టీమ్ కోచ్‌లకు వ్యతిరేకంగానే ఉండటం ఆందోళనకరమైన విషయంగా చెప్పొచ్చు.

ఎంత బాగా ఆడినా.. ఆటలో ఎంత టాలెంట్ ఉన్నా.. సెలక్షన్ కమిటీలో ఉన్నోడైనా, కోచ్ అయినా, మరొకడైనా.. ఎవడో ఒకడు.. మహిళా ప్లేయర్లను తమ లైంగిక ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూడటమే.. ఇండియన్ స్పోర్ట్స్‌లో ఉన్న దౌర్భాగ్యం. నేషనల్ టీమ్ కోసం జట్టును ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు.. అడ్వాంటేజ్ తీసుకోవాలని చూడటం వల్లే టాలెంటెడ్ ప్లేయర్లు.. భారత్ తరఫున ప్రదర్శన చేయకుండా దూరమైపోతున్నారు. ఫైనల్ టీమ్‌లో ప్లేయర్‌గా సెలక్ట్ చేయాలంటే తమ కోరిక తీర్చాలంటూ.. ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ చేస్తారు. ఒప్పుకోకపోతే కెరీర్ నాశనం చేస్తామంటూ బెదిరిస్తారు. స్పోర్ట్స్ ట్రైనింగ్ క్యాంపుల్లో.. ఈ విధంగా జరిగే లైంగిక వేధింపుల అంశంపై ఇప్పటికే ఎన్నో సినిమాలు కూడా వచ్చాయ్. అదంతా.. సినిమా మాత్రమే.. అని ఈజీగా కొట్టిపారేయలేం. కొన్ని వాస్తవిక ఘటనల నుంచే.. ఆ కథలు పుట్టుకొచ్చాయ్. తెర మీద మన క్రీడా వ్యవస్థలో ఉన్న దరిద్రపు సంస్కృతిని.. అందరి కళ్లకు కట్టాయ్.

ఈ లైంగిక వేధింపుల వల్లే.. మన భారత జట్లు.. ఒలింపిక్స్, కామన్‌వెల్త్, ఏషియా గేమ్స్ లాంటి మెగా టోర్నీల్లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్నాయ్. మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్లకే.. ఇలాంటివి జరుగుతున్నాయ్. చాలా మంది మహిళా ప్లేయర్లు.. తమ ఆత్మాభిమానాన్ని చంపుకోలేక.. టీమ్‌కు సెలక్ట్ కాకపోయినా ఫరవాలేదని.. ఆటలను వదిలేస్తున్నారు. టాలెంటెడ్ ప్లేయర్లంతా స్పోర్ట్స్ క్యాంప్ వదిలి ఇంటి బాట పడుతున్నారు. దాంతో.. ట్రైనింగ్‌లో ఉన్న వాళ్లనే.. పూర్తి స్థాయిలో ఆట గురించి ఏమీ తెలుసుకోకుండా ఉన్న ప్లేయర్లను.. తుది జట్టుకు సెలక్ట్ చేస్తున్నారు. దాంతో.. అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత్ వంద శాతం మెరుగైన ప్రదర్శన చేయలేక.. చేతులెత్తేస్తోంది. దాంతో.. పతకాల సంగతి పక్కనబెడితే.. దేశం పరువు పోయినంత పనవుతోంది.

Wrestler protest: కొనసాగుతున్న రెజ్లర్ల ఆందోళన.. మద్దతు తెలిపిన బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ ..

లైంగిక వేధింపులు మాత్రమే కాదు.. అంతర్గత రాజకీయాలు కూడా దేశంలోని క్రీడా రంగానికి శనిలా దాపురించాయ్. మారుమూల పల్లెల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి ఆటలపై ఇష్టం పెంచుకొని.. గేమ్ కోసం ప్రాణం పెట్టి ఆడేవాళ్లంతా.. ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని.. నేషనల్స్ దాకా వస్తారు. అక్కడికొచ్చాక.. బ్యాక్‌గ్రౌండ్ లేదనో.. తాము అడిగినంత డబ్బు ఇచ్చే స్థోమత లేదనో.. వాళ్లను సెలక్ట్ చేయకుండా పక్కనబెట్టేస్తారు. రికమండేషన్ ఉన్నా.. వాళ్లు అడిగినంత డబ్బులిచ్చినా.. ఆట రాకపోయినా.. కొందరు ప్లేయర్లు సెలక్ట్ అయిపోతారు. దేశం తరఫున ఆడాల్సి వచ్చినప్పుడు అరకొర ప్రదర్శనతో మమ అనిపించేస్తారు. ఇలాంటి.. చీప్ ట్రిక్స్, చీప్ పాలిటిక్స్ కూడా టాలెంటెడ్ ప్లేయర్లకు నష్టం చేస్తున్నాయ్. ఫలితంగా.. అంతర్జాతీయ క్రీడా వేదికల్లో పతకాలు సాధించలేక.. భారత్ పేరు మరింత కిందకి పడిపోతూనే ఉంది.

తక్కువ జనాభా ఉన్న దేశాలేమో.. పతకాల పట్టికలో.. పైన ఉంటాయ్. ఇన్ని కోట్ల జనాభా కలిగి ఉండి.. ఏ దేశంలో లేనంత యువతరాన్ని కలిగి ఉన్న భారత్ మాత్రం పతకాల కోసం ఇంకా పాకులాడుతూనే ఉంది. ఇందుకు.. క్రీడా వ్యవస్థలో ఉన్న కొందరు వ్యక్తులు మాత్రమే. వాళ్ల సొంత ప్రయోజనాల కోసం, లైంగిక పరమైన కోరికలు తీర్చుకోవడం కోసం.. మంచి భవిష్యత్తు ఉన్న ప్లేయర్లను.. మొదట్లోనే తొక్కేస్తున్నారు. వాళ్ల ఆశలను, ఆశయాలను.. నిర్దాక్షిణ్యంగా తుంచేస్తున్నారు. అయితే.. కొందరు మాత్రం ధైర్యంగా వాళ్ల ఆగడాలను, వేధింపులను బయటపెడుతున్నారు. బజారుకీడ్చి.. వాళ్ల అసలు స్వరూపాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నారు. అవి ఆరోపణలే అయినప్పటికీ.. వ్యవస్థలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఎలాంటి వారు పెత్తనం చెలాయిస్తున్నారన్న విషయం మాత్రం బాగా అర్థమవుతోంది. ఇండియాలో టాప్‌ రెజ్లర్లంతా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారంటేనే.. రెజ్లింగ్ సమాఖ్య ఏ స్థాయికి దిగజారిదో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి మారాలంటే. .మొత్తం క్రీడావ్యవస్థనే ప్రక్షాళన చేసి.. ప్రొఫెషనలిజమ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది.

Brij Bhushan Sharan: ఆ ఆరోపణలు నిజమని తేలితే ఉరేసుకుంటా: రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్