PM vs Akhilesh : స‌ర‌యూ కెనాల్ ప్రాజెక్టుపై మోదీ-అఖిలేష్ విమర్శల బాణాలు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌ల‌రాంపూర్‌లో స‌ర‌యూ కెనాల్ నేష‌న‌ల్ ప్రాజెక్టును శనివారం ప్ర‌ధాని మోదీ ప్రారంభించారు. సుధీర్ఘంగా పెండింగ్​లో ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ప్రభుత్వం

PM vs Akhilesh : స‌ర‌యూ కెనాల్ ప్రాజెక్టుపై మోదీ-అఖిలేష్ విమర్శల బాణాలు

Modi Akilesh

PM vs Akhilesh : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌ల‌రాంపూర్‌లో స‌ర‌యూ కెనాల్ నేష‌న‌ల్ ప్రాజెక్టును శనివారం ప్ర‌ధాని మోదీ ప్రారంభించారు. సుధీర్ఘంగా పెండింగ్​లో ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ప్రభుత్వం నిబద్ధతతో పనిచేసిందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. యూపీ తూర్పు ప్రాంతంలో రైతుల కష్టాలు ఈ ప్రాజెక్టుతో తీరిపోతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో 14 లక్షల హెక్టార్ల భూములకు సాగు నీరు అందుతుందని, 6,200 గ్రామాల్లోని 29 లక్షల రైతులకు లబ్ధి చేకూరుతుందని మోదీ తెలిపారు.

సరయు కెనాల్ ప్రాజెక్టును 1978లోనే ప్రారంభించారు. అయితే నిధుల లేమితో పాటు వివిధ కారణాలతో నాలుగు దశాబ్దాలైనా పూర్తి కాలేదు. ఈ క్రమంలో 2016లో ఈ ప్రాజెక్టును ‘ప్రధాన్​ మంత్రి కృషి సంచాయ్​ యోజన’లో చేర్చి నిర్ణీత సమయంలో పూర్తి చేశారు. మొత్తం రూ.9,800 కోట్ల వ్యయంలో రూ.4,600 కోట్లు గత నాలుగేళ్లలోనే కేటాయించారు. ఘగ్గర్​, సరయూ, రాప్తి, బాన్‌గంగ, రోహిణీ నదుల అనుసంధానిస్తూ నీటి వనరులను మెరుగ్గా ఉపయోగించుకునేలా ఈ ప్రాజెక్టు రూపొందించారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది జిల్లాలు-బహ్‌రిచ్, స్రవస్తి, బలరాంపూర్, గోండ, సిద్ధార్ధ్‌నగర్, బస్తి, సంత్ కబీర్ నగర్, గోరఖ్‌పూర్, మహారాజ్‌గంజ్‌లకు ప్రయోజనం చేకూరుతుంది.

స‌ర‌యూ కెనాల్ నేష‌న‌ల్ ప్రాజెక్టును బలరాంపూర్‌లో ప్రారంభించిన అనంతరం సమాజ్ వాదీ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మోదీ…”ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది మేమే అని ఎవరైనా వచ్చి చెబుతారా అని ఇవాళ ఉదయం నేను ఢిల్లీ నుండి బయలుదేరినప్పుడు అని ఎదురు చూస్తున్నాను. బహుశా వారు తమ యవ్వనంలో ఈ ప్రాజెక్ట్ కోసం రిబ్బన్ ని కట్ చేసి ఉండవచ్చు. కొంతమందికి ప్రాధాన్యత ‘ఊహలు’, మా ప్రాధాన్యత ‘అమలు’. రిబ్బన్లు కట్ చేసి, ఆ తర్వాత పని మర్చిపోవడం కొందరి స్వభావం. దశాబ్దాల క్రితం వాళ్లు ప్రాజెక్టు రిబ్బన్‌ కట్‌ చేసిన మాట నిజమే కావచ్చు కానీ.. రిబ్బన్‌లు కట్‌ చేయడం మాత్రమే చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ లో మా స్వభావం పనిని పూర్తి చేయడం మరియు ప్రాజెక్టులను సకాలంలో అందించడం” అని ప్రధాని అన్నారు.

ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పుడు దాని ఖర్చు రూ. 100 కోట్లలోపే ఉందని, అయితే నేడు దాదాపు రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసి పూర్తి చేశామని ప్రధాని మోదీ అన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి దేశం ఇప్పటికే 100 రెట్లు ఎక్కువ చెల్లించిందని ప్రధాని మోదీ అన్నారు.

కాగా, 75శాతం సరయూ కెనాల్ ప్రాజెక్టు పనులు సమాజ్ వాదీ ప్రభుత్వ హయాంలో పూర్తి అయ్యాయంటూ ఇవాళ ఉదయం యూపీ మాజీ సీఎం,ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన ఓ ట్వీట్ నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాల మైండ్ సెట్ వల్లనే సరయూ కెనాల్ ప్రాజెక్టు పూర్తవ్వడానికి 50 ఏళ్లు పట్టిందన్నారు. ఆ మైండ్ సెట్ దేశ పురోగతికి అతిపెద్ద అడ్డంకి అని మోదీ అన్నారు. ఎస్పీ,బీఎస్పీ,కాంగ్రెస్ లను రాబోయే ఎన్నికల్లో శిక్షించాలని ఈ సందర్భంగా ప్రజలను మోదీ కోరారు.

యూపీలో ఐదేళ్ల క్రితం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు..మాఫియాలను రక్షించేందుకు గత ప్రభుత్వాలు పనిచేశాయన్న మోదీ…యోగి ప్రభుత్వం యాఫియాను తరిమికొట్దిందన్నారు. అందుకే యూపీ ప్రజలు ఫరక్ సాఫ్ హై(వ్యత్యాసం చాలా సృష్టంగా ఉంది)అని చెబుతున్నారన్నారు. గతంలో అధికారంలో ఉన్నవారు భూ కబ్జాలకు పాల్పడ్డారని,నేడు యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో మాఫియాలపై బుల్డోజర్లను ప్రయోగిస్తున్నట్లు మోదీ తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి కారణంగా దేశం 100 రెట్లకు పైగా మూల్యం చెల్లించుకుందని మోదీ అన్నారు.

మరోవైపు,బలరాంపూర్ లో ప్రధాని కార్యక్రమం ముగిసిన వెంటనే ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ..”ఫరక్ సాఫ్ హై(వ్యత్యాసం చాలా సృష్టంగా ఉంది). యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు కావస్తొంది. కానీ వాళ్లకు తమ సొంత సంకల్ప్ పత్ర(బీజేపీ మేనిఫెస్టో)ను చూసే సమయం లేకుండా పోయింది. యాడ్ లు,బ్యానర్లు,హోర్డింగ్స్ పైనే వాళ్లు భారీగా డబ్బులు ఖర్చుపెడ్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లు ఇచ్చింది. కానీ బీజేపీ ప్రభుత్వం యువతపై లాఠీలు ఝులిపించింది. ఇదే చాలా సృష్టంగా ఉన్న వ్యత్యాసం. ఏదైనా పేరు మార్చాలని ఎవరైనా అనుకుంటే సీఎంకి విజ్ణప్తి చేసుకోండి,ఆ పేరు ఫరక్ సాఫ్ హై(వ్యత్యాసం చాలా సృష్టంగా ఉంది)గా ఉంటుంది”అంటూ గత కొన్నేళ్లుగా యూపీలో యోగి సర్కార్ పేర్లను మార్చడంపై సెటైర్లు వేశారు అఖిలేష్ యాదవ్.

ALSO READ Jayalalithaa’s Home : జయలలిత నివాసాన్ని స్వాధీనం చేసుకున్న దీప