NZ vs AUS : తుది పోరుకు వేళాయే…ఆస్ట్రేలియా – న్యూజిలాండ్..ఏ జట్టు గెలిచేనో

టీ20 ప్రపంచకప్ 2021 తుది పోరుకి సమయం ఆసన్నమైంది. ఇవాళ దుబాయ్ ఇంటర్నేషనల్  స్టేడియంలో జరిగే  ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టైటిల్‌ కోసం తలపడనున్నాయి.

NZ vs AUS : తుది పోరుకు వేళాయే…ఆస్ట్రేలియా – న్యూజిలాండ్..ఏ జట్టు గెలిచేనో

T20 Workld Cup 2021

ICC T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్ 2021 (T20WorldCup) తుది పోరుకి సమయం ఆసన్నమైంది. 2021, నవంబర్ 14వ తేదీ ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్  స్టేడియంలో జరిగే  ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టైటిల్‌ కోసం తలపడనున్నాయి. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇరు జట్లు ఫైనల్‌లో తలపడడం ఇదే తొలిసారి. దీంతో ఏ జట్టు గెలిచినా.. చరిత్ర సృష్టించనున్నాయి.

Read More : Cyclone Jawad : ఏపీకి మరో తుపాన్ ముప్పు..భారీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరిక

ఇరు జట్ల బలాబలాలు చూస్తే ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టమే. ఇరు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. కానీ కొంత మంది ఆటగాళ్లు మాత్రం కీలకం కానున్నారు. న్యూజిలాండ్ జట్టును పరిశీలిస్తే ఆ జట్టు టాపార్డన్ చాలా బలంగా కనిపిస్తుంది. గప్తిల్ సెమీస్‌లో నిరాశ పరిచినా.. ఈ టోర్నీలో అతడు సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇక డారిల్ మిచెల్ సెమీఫైనల్ హీరోగా నిలిచాడు. క్లిష్ట సమయాల్లో సమయోచితంగా ఆడే సామర్థ్యం ఉంది. కేన్ విలియమ్‌సన్ తనదైన రోజున చెలరేగిపోతాడు. అయితే గాయం కారణంగా డెవాన్ కాన్వే జట్టుకు దూరం కావడం పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పవచ్చు.

Read More : ABP Survey : ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు బీజేపీకే..!

కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే నెంబర్ 6 వరకు అందరూ హార్డ్ హిట్టర్లే. ఇక బౌలింగ్ అయితే పూర్తి పటిష్టంగా ఉంది. టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ స్పెషలిస్ట్ టీ20 బౌలర్లు. వీరికి తోడుగా అడమ్ మిల్నే వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచుతున్నాడు. ఇష్ సోథి, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్ బౌలింగ్ విభాగం బలాన్ని పెంచుతున్నారు.