ABP Survey : ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు బీజేపీకే..!

వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ మినహా మిగతా అన్ని చోట్ల బీజేపీ విజయం సాదించనున్నట్లు సర్వేలో వెల్లడైంది.

ABP Survey : ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు బీజేపీకే..!

Abp Survey

ABP Survey : వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే సర్వే సంస్థలు ప్రజల్లోకి వెళ్లి వారి అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. తాజాగా ఏబీపీ న్యూస్ -సీఓటర్-ఐఏఎస్ఎన్ ఈ ఐదు రాష్ట్రాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పంజాబ్ మినహా మిగతా అన్ని చోట్ల బీజేపీ విజయం సాదించనున్నట్లు వెల్లడైంది. అయితే బీజేపీ గతంలో వచ్చిన మెజారిటీ ఈ ఎన్నికల్లో రాదని సర్వేలో తేలింది. పంజాబ్ లో అతిపెద్ద పార్టీగా ఆప్ అవతరించబోతుందని వెల్లడైనట్లు తెలిపింది. సర్వే సంస్థ 1,07,193 మంది అభిప్రాయాలను సేకరించగా ఈ ఫలితాలు వెలువడ్డాయి.

చదవండి : ABP Cvoter Survey : 5 రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు బీజేపీకే..!

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని సర్వేలో తేలింది. అయితే గతంలో వచ్చిన స్థానాలకంటే 108 స్థానాలు తగ్గే అవకాశం ఉందని వెల్లడైంది. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా 2017 ఎన్నికల్లో బీజేపీ 325 చోట్ల విజయం సాధించింది. అయితే ఈ సారి ఆ మార్క్ అందుకోవడం కష్టమని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. 2022 జరగబోయే ఎన్నికల్లో బీజేపీ 217 స్థానాల్లో విజయం సాధించి అధికారం నిలుపుకుంటుందని వెల్లడైంది. ఇక ఇక్కడ బీజేపీకి ఎస్పీ నుంచే ప్రధాన పోటీ అని తెలిపారు. ఎస్పీ 150 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తెలిపారు.

చదవండి : Panjab Police : పంజాబ్ సరిహద్దులో టిఫిన్ బాంబు స్వాధీనం

ఇక పంజాబ్ విషయానికి వస్తే.. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ అతిపెద్ద పార్టీగా నిలవనున్నట్లు వెల్లడైంది. 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ 51 స్థానాల్లో విజయం సాదిస్తుందని సర్వేలో తేలింది.. కాంగ్రెస్ 31, అకాలీదళ్ 20 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది.

గోవాలో మళ్ళీ అధికారం బీజేపీనే వరించనున్నట్లు తెలుస్తోంది. 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న గోవాలో బీజేపీ 21 చోట్ల విజయం సాదిస్తుందని సర్వేలో వెల్లడైంది.

చదవండి : Uttarakhand Rains : ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు..16మంది మృతి..హైదరాబాదీ యువతులు సేఫ్

ఇక 70 స్థానాలు ఉన్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ అధికారం నల్లేరుపై నడకేనని తేలింది. కానీ గతంలో వచ్చినంత మెజారిటీ రాదని వెల్లడైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 36 స్థానాలు కావాల్సి ఉండగా.. బీజేపీ 38 చోట్ల విజయం సాదిస్తుందని పేర్కొన్నారు.

మణిపూర్‌లో మరోసారి బీజేపీ పాగా వేయనున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మణిపూర్ లో బీజేపీ 27 చోట్ల విజయం సాదిస్తుందని, కాంగ్రెస్ 22 చోట్ల గెలుస్తుందని సర్వేలో తేలింది.

ఇక ఈ సర్వేలో బీజేపీ ప్రస్తుతం ఉన్న అన్ని రాష్ట్రాల్లో తమ అధికారం నిలబెట్టుకుంటుందని తేలింది. పంజాబ్‌లో మాత్రం ఒక్కసీటు కూడా కష్టమే అని తేల్చింది.