Delhi Temperature: ఢిల్లీలో అత్యల్పంగా 4డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు

ఢిల్లీలో మంగళవారం అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. డిసెంబర్ 21వ తేదీ సఫ్దరజంగ్ అబ్జర్వేటరీ ఉష్ణోగ్రతలు 4డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయిన విషయాన్ని గుర్తించారు.

Delhi Temperature: ఢిల్లీలో అత్యల్పంగా 4డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు

Imd

Updated On : December 21, 2021 / 9:49 AM IST

Delhi Temperature: ఢిల్లీలో మంగళవారం అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. డిసెంబర్ 21వ తేదీ సఫ్దరజంగ్ అబ్జర్వేటరీ ఉష్ణోగ్రతలు 4డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయిన విషయాన్ని గుర్తించారు. ఇండియా మెటరాలాజికల్ డిపార్ట్‌మెంట్ కథనం ప్రకారం.. ”ఉదయం 8గంటల 30నిమిషాల సమయంలో 4డిగ్రీల సెల్సియస్ గా ఉంది” అని ఐఎండీ చెప్పింది.

సోమవారం అంతకంటే ముందు 3.2 డిగ్రీల సెల్సియస్ గా నమోదైందని అధికారులు చెప్తుంటే.. ఢిల్లీలోని అఫ్ఫర్ పూర్ గ్రామంలో 2.9డిగ్రీల సెల్సియస్ గా నమోదైందట. మున్ముందు మరిన్ని కోల్డ్ వేవ్ లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఐఎండీ హెచ్చరిస్తుంది.

పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో మరింత అత్యల్ప స్థాయికి పడిపోనున్నాయి ఉష్ణోగ్రతలు. ఉత్తరాఖాండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం నాటికి జమ్మూ, కశ్మీర్-లడఖ్- గిల్జిత్ – బల్తిస్తాన్ -ముజాఫర్‌బాద్, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ లోప్రాంతాల్లో అత్యంత దారుణంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారుల అంచనా.

 

…………………………….. : అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం