Trinamool Congress MP: మహిళ సీఎంగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై చిన్న నేరం జరగడం కూడా సిగ్గుచేటు

ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై ఏ చిన్న నేరం జరిగినా అది ఎంతో సిగ్గుచేటని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత రాయ్ అన్నారు

Trinamool Congress MP: మహిళ సీఎంగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై చిన్న నేరం జరగడం కూడా సిగ్గుచేటు

West

Trinamool Congress MP: ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై ఏ చిన్న నేరం జరిగినా అది ఎంతో సిగ్గుచేటని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత రాయ్ అన్నారు. గురువారం ఎంపీ సౌగత రాయ్ పార్లమెంటులో మాట్లాడుతూ “మహిళలపై జరిగే నేరాల గురించి ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. ఇది మీడియా వల్ల జరిగిందో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు, ఈ విషయాలపై మనం సహనం వహించాలి. ఏదైనా సంఘటన జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలి. ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో, ఆమె నాయకత్వంలో మహిళలపై జరిగే ఒక్క నేరం కూడా మనందరికీ సిగ్గుచేటని నేను భావిస్తున్నాను, పోలీసులు మరియు పరిపాలన ఈ వాస్తవాన్ని గుర్తించాలి” అని అన్నారు. కాగా పది రోజుల క్రితం పశ్చిమబెంగాల్ లోని నదియా జిల్లా హంస్ఖలీలో 14 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈనేపథ్యంలోనే అధికార తృణమూల్ ఎంపీ సౌగత రాయ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also read:Chennakesava Temple: కర్ణాటకలో ఖురాన్ పఠనంతో ప్రారంభమైన చెన్నకేశవ రథయాత్ర

పశ్చిమబెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈఘటనలో..అధికార తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన పంచాయతీ సభ్యుడు సమరేంద్ర గయాలీ కుమారుడు సోహైల్ గయాలీ అలియాస్ బ్రజ గోపాల్ గయాలీ అనే 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 14 ఏళ్ల బాలిక..స్నేహితుల పుట్టిన రోజు వేడుక ఉందంటూ ఏప్రిల్ 4 సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. అనంతరం కొన్ని గంటలకే రక్తస్రావంతో ఇంటికి చేరుకున్న బాలికను చూసి తల్లి కంగారు పడింది. వెంటనే స్థానిక వైద్యుడిని సంప్రదించి మందులు ఇవ్వగా..మందులు వేసుకున్న గంటలోనే బాలిక మృతి చెందింది. అయితే బాలిక మృతిపై కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగువారు అనుమానాలు వ్యక్తం చేసినా..చేసేదేమిలేక..అప్పటికప్పుడే బాలిక మృతదేహాన్ని ఖననం చేశారు.

Also read:Telangana : కేసీఆర్ తప్ప..ద‌ళితుల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇచ్చిన మ‌గాడు దేశంలో ఉన్నాడా? : KTR

అయితే ఎటువంటి మరణధ్రువీకరణ పత్రం లేకుండానే బాలిక మృతదేహాన్ని ఖననం చేశారంటూ స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ నేత కొడుకే బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని..ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఏప్రిల్ 10 నాటికి విషయం చిలికిచిలికి గాలి వానగా మారినట్టు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. దీంతో స్వయంగా సీఎం మమతా బెనర్జీనే ఘటనపై డీజీపీని ఆరా తీసి..భాద్యులైన వారిని అరెస్ట్ చేయాలనీ ఆదేశించారు.

Also read:Philippines : భారీ వర్షాలతో ఫిలిప్పీన్స్ అతలాకుతలం.. విరిగిపడుతున్న కొండచరియలు.. వారంరోజుల్లో 121 మంది మృతి..

అయితే రక్తస్రావంతో ఇంటికి వచ్చిన బాలికను కనీసం వైద్యుడికి చూపించకుండానే కుటుంబ సభ్యులు మందులు తీసుకోవడంతో పోలీసులకు ఎక్కడా సరైన ఆధారాలు లేకుండాపోయాయి. దీంతో పుట్టినరోజు వేడుక నిర్వహించిన సోహైల్ గయాలీ అలియాస్ బ్రజ గోపాల్ గయాలీ, అతని స్నేహితుడు ప్రభాకర్ పొద్దార్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఒకే పాఠశాలలో చదువుకున్నామంటూ బాలికను మచ్చిక చేసుకున్న సోహైల్ గయాలీ..పలుమార్లు తనతో తీసుకెళ్లడం చూశామంటూ స్థానిక యువకులు కొందరు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.