Great Khali to join BJP : బీజేపీలో చేరిన రెజ్లింగ్ స్టార్ గ్రేట్ ఖలి
ది గ్రేట్ ఖలీగా పేరొందిన ప్రొఫెషనల్ రెజ్లర్ దలీప్ సింగ్ రాణా బీజేపీలో చేరారు.

Great Khali To Join Bjp
Wrestler The Great Khali to join BJP today : ది గ్రేట్ ఖలీగా పేరొందిన ప్రొఫెషనల్ రెజ్లర్ దలీప్ సింగ్ రాణా బీజేపీలో చేరారు. రెజ్లింగ్ స్టార్ గ్రేట్ ఖలి బీజేపీలోకి చేరితో పంజాబ్ లో కాషాయ బలపుంచుకుంటుందని భావిస్తున్నారు. పంజాబ్‌లో బలం పెంచుకునేందుకు యత్నిస్తున్న బీజేపీ ఇతర పార్టీల నుంచే కాకుండా ప్రముఖులను కమల దళంలో చేర్చుకుంది. దీంట్లో భాగంగానే ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలి బీజేపీలోకి చేరటానికి ఇప్పటికే అన్ని సిద్ధమయ్యాయి. ఈరోజు ఖలీ బీజేపీలోకి చేరారు. దీనికోసం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఖలీ అసలుపేరు దలీప్‌సింగ్ రాణా.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పంజాబ్‌లో ఫిబ్రవరి నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 117 సీట్లు ఉన్న పంజాబ్ లో సీఎం పీఠం కోసం అధికార కాంగ్రెస్ సహా బీజేపీ, ఆప్, అకాలీదళ్ హోరా హోరీన పోరాడుతున్నాయి. అయితే..వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పంజాబ్ రైతులు పెద్దఎత్తున పాల్గొన్న విషయం తెలిసిందే.
Also read : Supreme Court : మహిళా జడ్జిని ఐటెం సాంగ్ చేయాలని వేధించిన న్యాయమూర్తి’ : సుప్రీంకోర్టు కీలక తీర్పు
మరి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సాగు చట్టాల విషయం బీజేపీకి ప్రతికూలంగా..ఇతర పార్టీలకు అనుకూలంగా మారుతుందా?అనే విషయం తెలియాల్సి ఉంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా రైతులు ఆందోళనలు నిర్వహించారు. అయినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. పలుమార్లు చర్చలు జరిపినా ఫలితాలు మాత్రం కుదరలేదు. చట్టాల్లో మార్పులు చేస్తామని కేంద్రం చెప్పినా..రైతులంతా ఏకతాటిపై నిలబడి ఆందోళనలకు కొనసాగించారు.
ఈక్రమంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయనే క్రమంలో వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రకటించింది బీజేపీ. ఇది కేవలం రాజకీయ లబ్ది కోసమే బీజేపీ వెనక్కి తగ్గిందనే ఆరోపణలున్నాయి. ఈక్రమంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇది బీజేపీకి ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా గళాలుకూడా వినిపిస్తున్న క్రమంలో రాష్ట్రంలో ప్రజలను తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నం పలు యత్నాలు చేస్తోంది.
Also read : Man 78 times Covid positive: వయస్సు 56..78 సార్లు పాజిటివ్..14 నెలలుగా ఐసోలేషన్‌లో చికిత్స..!
కాగా.. దలీప్ సింగ్ రాణా అనే కంటే ది గ్రేట్ ఖలి అంటేనే బాగా తెలుస్తుంది. గ్రేట్ ఖలి అంటే భారత్ ప్రజల్లో ఎక్కువ మందికి పరిచయం ఉన్న వ్యక్తి. అంతర్జాతీయంగా ‘రెజ్లర్’ ఆటలో ఎన్నో మెడల్స్ సంపాదించిన మల్ల యుద్ధ వీరుడు. గ్రేట్ ఖలిగా పిలుచుకునే దలీప్ సింగ్ రాణా బీజేపీలో చేరారు. గురువారం (ఫిబ్రవరి 10,2022)ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఖలి మాట్లాడుతూ..‘‘బీజేపీలో చేరినందుకు సంతోషంగా ఉంది. దేశానికి ప్రధాని చేస్తున్న కృషి ఆయన్ను సరైన ప్రధానిని చేస్తోందని నా అభిప్రాయం. దేశ అభివృద్ధి కోసం ఆయన పాలనలో నేనూ భాగం కావాలనే ఉద్ధేశ్యంతో బీజేపీలో చేరానని తెలిపారు. బీజేపీ జాతీయ విధానం నచ్చి బీజేపీలో చేరుతున్నానని అన్నారు.
Also read : Hizab :హిజాబ్ వివాదంపై పాక్ విమర్శలు..మా సమస్యను మేం చూస్కుంటాం..మీరు నీతులు చెప్పక్కర్లా
పంజాబ్ రాష్ట్ర ఎన్నికల ముందు పంజాబ్ కు చెందిన ఖలి బీజేపీలో చేరడం పార్టీకి ఎంతో కొంత లాభించనుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. గ్రేట్ ఖలి ప్రొఫెషనల్ రెజ్లర్. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఛాంపియన్ షిప్ ద్వారా బాగా పేరొందాడు. ఖలీ నటుడు కూడా. రెండు బాలీవుడ్ సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించాడు. 7 అడుగుల ఒక అంగుళం ఎత్తుతో, తన ఆటతీరుతో అందరి ఆకట్టుకున్నాడు.