Wrestlers: మాకు వచ్చిన మెడల్స్ అన్నింటినీ వెనక్కి ఇచ్చేస్తాం: రెజ్లర్లు

Wrestlers: వినేశ్ ఫొగట్ (Vinesh Phogat), సాక్షి మాలిక్ (Sakshi Malik), బజరంగ్ పునియాకు ఖేల్ రత్నా (Khel Ratna) పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. అలాగే, సాక్షి మాలిక్ 2017లో, బజరంగ్ పునియా 2019లో పదశ్రీ (Padma Shri) అవార్డు కూడా అందుకున్నారు.

Wrestlers: మాకు వచ్చిన మెడల్స్ అన్నింటినీ వెనక్కి ఇచ్చేస్తాం: రెజ్లర్లు

Wrestlers

Wrestlers: భారత్‌కు అంతర్జాతీయంగా ఎన్నో పతకాలు సాధించి పెట్టి దేశాన్ని తలెత్తుకునేలా చేసిన టాప్ రెజ్లర్లు (Wrestlers) ఇప్పుడు ఆ మెడల్స్ అన్నింటినీ వెనక్కి ఇచ్చేస్తామని చెబుతున్నారు. దేశంలోని 140 కోట్ల మంది తరఫున ఆడి ఇన్ని పతకాలు సాధించినా తమ పట్ల సానుకూల నిర్ణయాలు తీసుకోవడం లేదని అంటున్నారు.

వినేశ్ ఫొగట్ (Vinesh Phogat), సాక్షి మాలిక్ (Sakshi Malik), బజరంగ్ పునియాకు ఖేల్ రత్నా (Khel Ratna) పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. అలాగే, సాక్షి మాలిక్ 2017లో, బజరంగ్ పునియా 2019లో పదశ్రీ (Padma Shri) అవార్డు కూడా అందుకున్నారు.

“రెజ్లర్ల పట్ల ఇటువంటి తీరే కనబర్చుతామంటే.. ఇక మాకు వచ్చిన పతకాలను మేము ఏం చేసుకోవాలి? మాకు వచ్చిన పతకాలన్నింటినీ భారత ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తాం” అని రెజ్లర్ బజరంగ్ పునియా (Wrestler Bajrang Punia ) అన్నారు.

అంతర్జాతీయ అవార్డులు మాత్రమేనా?
రెజ్లర్ బజరంగ్ పునియా (Wrestler Bajrang Punia)కు మీడియా ఓ ప్రశ్న వేసింది. అంతర్జాతీయ అవార్డులు మాత్రమే తిరిగి ఇచ్చేస్తారా? భారత్ లో వచ్చిన అవార్డులు కూడానా? అని అడిగింది. దీంతో ఆ ప్రశ్నకు వినేశ్ ఫొగట్ సమాధానం ఇస్తూ… “అన్నింటినీ వెనక్కి తీసుకోండి. మమ్మల్ని ఇప్పటికే చాలా అవమానించారు” అని సమాధానం ఇచ్చారు.

తాము ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగితే పోలీసులు తమ పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని రెజ్లర్లు అంటున్న విషయం తెలిసిందే. పోలీసులు తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని, మహిళా పోలీసులు ఎక్కడ? అని వినేశ్ ఫొగట్ అన్నారు. కావాలంటే తమను చంపాలని, అంతేగానీ, ఇటువంటి అవమానాలకు గురి చేయొద్దని వ్యాఖ్యానించారు.

రెజ్లర్లు దాదాపు మూడు నెలల నుంచి పోరాడుతున్నా వారి డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చడం లేదు. వారి డిమాండ్ల పట్ల నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోందని రెజ్లర్లు అంటున్నారు. మహిళా రెజ్లర్లకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని రెజ్లర్లు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)పై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.

అయితే, ఆయనను అరెస్టు చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. మూడు నెలల క్రితం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని ఇప్పటికీ ఆ పని చేయట్లేదని అంటున్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సహా పలువురు ట్రైనర్ల నుంచి తమకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని ఏడుగురు మహిళా రెజ్లర్లు చెప్పారు. ఆ రెజ్లర్లలో ఓ మైనర్ కూడా ఉండడం గమనార్హం.

Wrestlers Protest: పోలీసు మద్యం మత్తులో మమ్మల్ని దుర్భాషలాడాడు.. అర్థరాత్రి గొడవపై కన్నీరు పెట్టుకున్న రెజ్లర్లు