Wrestlers vs WFI chief: రెజ్లర్లకు మద్ధతుగా ఖాప్ మహాపంచాయత్

సింగ్ ఫొటో క్లిక్ చేయాలనే సాకుతో తనను గట్టిగా పట్టుకున్నాడని ఓ మైనర్ రెజ్లర్ తన ఫిర్యాదులో పేర్కొంది. అతను తన భుజాన్ని ఉద్దేశపూర్వకంగా నొక్కి, అనుచితంగా తాకాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. రెస్టారెంట్ హోటల్‌లో డిన్నర్ చేస్తున్న సమయంలో డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ తనను అనుచితంగా తాకినట్లు ఫిర్యాదుదారులు ఆరోపించారు.

Wrestlers vs WFI chief: రెజ్లర్లకు మద్ధతుగా ఖాప్ మహాపంచాయత్

Sakshi Malik

Wrestlers vs WFI chief: తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు మద్ధతుగా హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో రైతునాయకులు శుక్రవారం మహా పంచాయత్ నిర్వహించారు.(farmers to hold khap mahapanchayat) తమను లైంగికంగా వేధించిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. రెజ్లర్ల ఆందోళనకు వ్యూహాన్ని రూపొందించేందుకు వీలుగా ఖాప్ పంచాయితీలో పాల్గొనేందుకు యూపీ, హర్యానా రాష్ట్రాల నేతలు కురుక్షేత్రకు వచ్చారు.(Haryana’s Kurukshetra) తాము తమ కుమార్తెలను రెజ్లర్లుగా చేస్తే వారిని లైంగికంగా వేధించిన బ్రిజ్ భూషణ్ పై తక్షణమే చర్య తీసుకోవాలని ఖాప్ పంచాయితీ నేతలు డిమాండ్ చేశారు. అతనిపై చర్యలు తీసుకునే వరకు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని రైతులు తెలిపారు.

Hijab: మధ్యప్రదేశ్ పాఠశాలలో మళ్లీ హిజాబ్ వివాదం…విచారణకు సర్కారు ఆదేశం

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఖాప్ మహాపంచాయత్ జరిగిన ఒక రోజు తర్వాత, డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లకు న్యాయం చేయాలని కోరుతూ ఒక ప్రతినిధి బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలవాలని నిర్ణయించారు.బ్రిజ్ భూషణ్ సింగ్‌కు రెండు చాపర్లు, 60 డిగ్రీ కాలేజీలు, 50 ఇంటర్ కాలేజీలు, ఒక ఫామ్, హెలిప్యాడ్ ఉన్నాయని, అతనిపై 48 క్రిమినల్ కేసులున్నాయని యూపీ ఖాప్ అధ్యక్షుడు బావా పర్మీందర్ ఆర్య ఆరోపించారు. రెజ్లర్లకు మద్దతుగా ఖాప్‌ల ప్రతినిధులు రాష్ట్రపతిని, ప్రభుత్వాన్ని కలుస్తారని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని రైతు నాయకుడు రాకేష్ తికాయత్ చెప్పారు.

Hijab: మధ్యప్రదేశ్ పాఠశాలలో మళ్లీ హిజాబ్ వివాదం… విచారణకు సర్కారు ఆదేశం

జంతర్ మంతర్ వద్ద మహిళా రెజ్లర్లు తమ నిరసనను కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతిపత్రాన్ని పంపినట్లు సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది.బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. మొదటి కేసు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద, ఐపీసీల కింద కేసులు నమోదయ్యాయి.డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌ సింగ్ పై వచ్చిన ఫిర్యాదుల్లో అతను అనుచితంగా తాకడం, అమ్మాయిల ఛాతీపై చేయి వేయడం వంటి చర్యలకు పాల్పడ్డాడని వెల్లడైంది.

Sedition Law: దేశద్రోహ చట్టాన్ని కొనసాగించాల్సిందే.. లా కమిషన్ షాకింగ్ కామెంట్స్

సింగ్ ఫొటో క్లిక్ చేయాలనే సాకుతో తనను గట్టిగా పట్టుకున్నాడని ఓ మైనర్ రెజ్లర్ తన ఫిర్యాదులో పేర్కొంది. అతను తన భుజాన్ని ఉద్దేశపూర్వకంగా నొక్కి, అనుచితంగా తాకాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. రెస్టారెంట్ హోటల్‌లో డిన్నర్ చేస్తున్న సమయంలో డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ తనను అనుచితంగా తాకినట్లు ఫిర్యాదుదారులు ఆరోపించారు. సింగ్ తన భుజాలు, మోకాలు, అరచేతిని తాకినట్లు మరో ఫిర్యాదుదారు తెలిపింది. తన శ్వాస తీరును అర్థం చేసుకునే సాకుతో ఛాతీ, పొట్టపై కూడా తాకాడని బాధితురాలు ఆరోపించింది.