Eatala Rajender : బీజేపీ ఎమ్మెల్యేకి వై ప్లస్ సెక్యూరిటీ.. కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం

Eatala Rajender : తన భర్త ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరిగిందని ఈటల జమున చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి.

Eatala Rajender : బీజేపీ ఎమ్మెల్యేకి వై ప్లస్ సెక్యూరిటీ.. కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం

Eatala Rajender (Photo : Twitter)

Updated On : June 30, 2023 / 9:06 PM IST

Eatala Rajender – Security : కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బీజేపీ కీలక నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు వై ప్లస్ భద్రత కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రేపు (శనివారం) ఉదయం నుంచి హుజురాబాద్ ఎమ్మెల్యే రాజేందర్ కు వై ప్లస్ స్టేట్ కేటగిరి భద్రత అందుబాటులోకి రానుంది.

భద్రత కింద బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తో పాటు 16 మంది సెక్యూరిటీ సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది. ఈటలకు ప్రాణహాని ఉన్నట్లు నివేదికలు అందాయి. దీంోత ఈటలకు భద్రత కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నుంచి ఈటలకు వై ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పించనుంది.

Also Read..Eatala Rajender: అక్కడి నుంచే నా హత్యకు కుట్రలు జరుగుతున్నాయి.. వాళ్లే నాకు చెప్పారు: ఈటల

తన భర్త ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరిగిందని ఈటల జమున చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి రూ.20కోట్లు ఖర్చు చేసైనా తన భర్తను హత్య చేయిస్తానని అన్నారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈటలకు భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Also Read..Eatala Jamuna : ఈటల రాజేందర్ హత్యకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు : ఈటల సతీమణి జమున