జగన్ ఆశీస్సులు ఉన్నాయ్.. తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలి

జగన్ ఆశీస్సులు ఉన్నాయ్.. తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలి

తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోండగా.. నల్గొండ, చేవెళ్ల జిల్లాల నేతలతో భేటి అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. ఈ సంధర్భంగా మిగతా జిల్లాలవారితో కలవాలి కాబట్టి.. వారిని కలిసిన తర్వాత ఏం చెయ్యాలి అనే విషయాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పుకొచ్చారు. పార్టీ పెట్టాలని డిసైడ్ అయ్యారా? అనే ప్రశ్నకు మాత్రం తెలియదు.. చూద్దాం.. అనే సమాధానం చెప్పారు.

తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పార్టీ అవసరం అని భావిస్తున్నట్లు షర్మిల వెల్లడించారు. తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారా? విద్యార్ధులు బాగున్నారా? అని ప్రశ్నించారు షర్మిల. మిగిలిన జిల్లాలలో అభిమానులు, అనుచరులతో మాట్లాడిన తర్వాత.. ముఖ్య ఎజెండా ప్రకటింస్తామని, రాజన్న రాజ్యం తెలంగాణలో తీసుకుని రావాలనేదే నా ఉద్దేశ్యం అని అన్నారు.

ప్రతి జిల్లాల్లో వారానికి రెండో.. లేకపోతే ఒకటో.. మీటింగ్ పెట్టి.. అందరితో మాట్లాడనున్నట్లు షర్మిల చెప్పుకొచ్చారు. నల్గొండ జిల్లా వాళ్లతో జరిగిన మీటింగ్‌లో చాలా పాజిటివ్‌గా ఉన్నారని, తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తేవాలని కోరిక ఉన్నట్లుగా షర్మిల వెల్లడించారు.

మీ నిర్ణయానికి ఏపీ సీఎం జగన్ సపోర్ట్ ఉందా? అనే ప్రశ్నకు.. జగన్ మోహన్ రెడ్డి నాకు తోడబుట్టిన అన్న.. ఆయన ఆశిస్సులు నాకు ఎప్పటికీ ఉంటాయని నమ్ముతున్నాను.. జగన్‌కు తెలియకుండా మీటింగ్‌లు జరుగుతాయా? అంటే మీరు నమ్ముతారా? అంటూ మీడియాని ప్రశ్నించారు షర్మిల.. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ శూన్యత ఉన్నదని ఆమె అభిప్రాయపడ్డారు. కొన్ని మీటింగ్‌లు జరిగిన తర్వాత, ప్రతి జిల్లావారితో కలిసిన తర్వాత రాజన్న రాజ్యం ఎలా తీసుకుని రావాలి అనే విషయమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.