YS Sharmila : అధికారంలోకి వస్తే ట్యాంక్ బండ్‌పై బీసీ నేతల విగ్రహాలు

కోస్గిలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మగౌరవ సభలో వైఎస్ షర్మిల మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీసీలను ఎప్పుడూ గౌరవించని కేసీఆర్ కు ఎన్నికల

YS Sharmila : అధికారంలోకి వస్తే ట్యాంక్ బండ్‌పై బీసీ నేతల విగ్రహాలు

Ys Sharmila

YS Sharmila : కోస్గిలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మగౌరవ సభలో వైఎస్ షర్మిల మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీసీలను ఎప్పుడూ గౌరవించని కేసీఆర్ కు ఎన్నికల సమయంలో మాత్రమే బీసీలు గుర్తుకొస్తారని విమర్శించారు. సమగ్ర సర్వే పేరుతో సీఎం కేసీఆర్ కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు.

Amazon Festival Sale : స్మార్ట్ ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు.. ప్రైమ్ యూజర్లకు బెనిఫిట్స్!

తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తుందన్న షర్మిల, ట్యాంక్ బండ్ పై బీసీ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు. బీసీ కులాలు కులవృత్తులకు మాత్రమే పరిమితం కావాలని.. బర్రెలు, గొర్రెలు, చేపలకు మాత్రమే పనికి వస్తారని కేసీఆర్ భావిస్తున్నారని షర్మిల అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆ పనులు ఎందుకు చేయరని ఆమె ప్రశ్నించారు. బీసీల సంక్షేమానికి ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలపాలని ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు.

Google ban: జాగ్రత్త! మీ ఫోన్‌లో ఈ 136 డేంజరస్ యాప్‌లు ఉంటే, బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు పోవచ్చు

కాగా, వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల అక్టోబ‌ర్ నుంచి పాద‌యాత్ర చేప‌ట్ట‌బోతున్న‌ట్టు గ‌తంలోనే ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. పాద‌యాత్ర‌కు సంబంధించిన రూట్ మ్యాప్‌, విధివిధానాల‌పై ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌తో షర్మిల ఇప్ప‌టికే చ‌ర్చించారు. గ‌తంలో వైఎస్ జ‌గ‌న్ తెలంగాణ‌లో చేప‌ట్టిన ప్ర‌జా ప్ర‌స్థానం యాత్ర పేరుతోనే యాత్రను కొన‌సాగించాల‌ని ష‌ర్మిల నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎక్క‌డి నుంచైతే పాద‌యాత్ర‌ను ప్రారంభించారో అక్క‌డి నుంచే అంటే చేవెళ్ల నియోజ‌కవర్గం నుంచే పాద‌యాత్ర‌ను చేప‌ట్టేందుకు ష‌ర్మిల సిద్ధం అవుతున్నారు. ఏడాదిపాటు పాద‌యాత్ర కొన‌సాగేలా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. చేవెళ్లలో ప్రారంభించి తిరిగి చేవెళ్లలో ముగిసేలా పాద‌యాత్ర రూట్ మ్యాప్‌ను రూపొందిస్తున్నారు.