YS Sharmila: 27 మంది విద్యార్థుల ఆత్మహత్యలు.. బంది పోట్ల రాష్ట్ర సమితిలో చలనం లేదు: షర్మిల

ఫొటోలకు పోజులిచ్చిన మంత్రులు.. ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని షర్మిల విమర్శించారు.

YS Sharmila: 27 మంది విద్యార్థుల ఆత్మహత్యలు.. బంది పోట్ల రాష్ట్ర సమితిలో చలనం లేదు: షర్మిల

YS Sharmila

YS Sharmila – IIIT Basar: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు తరుచూ చోటుచేసుకుంటుండడంతో దీనిపై వైఎస్సార్టీపీ (YSRTP) అధినేత్రి షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు.

” బాసర ట్రిపుల్ ఐటీలో ఇప్పటి వరకు 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా.. బందిపోట్ల రాష్ట్ర సమితిలో చలనం లేదు. ఈ విద్యా సంవత్సరంలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయినా దొరకు పట్టింపు లేదు. ఉన్నత విద్యకు నిలయాలైన ట్రిపుల్ ఐటీలను.. ఆత్మహత్యలకు నిలయంగా మార్చాడు కేసీఆర్.

గొప్ప ఆశయాలతో వచ్చిన పేద విద్యార్థులకు పురుగుల అన్నం, మురుగు నీరు ఇస్తూ ఆత్మహత్యలకు ఉసిగొల్పుతున్నారు. సర్కారు నియమించిన డైరెక్టర్లు కేసీఆర్ లాగే డుమ్మాలు కొడుతున్నారు. సిబ్బంది నియామకాలను మరిచారు.. క్యాంపస్ ల నిర్వహణను గాలికొదిలేశారు.. నిధుల కేటాయింపులను గంగలో కలిపేశారు. ఇంచార్జ్ అధికారులు, కాంట్రాక్టు ఉద్యోగులతో పబ్బం గడుపుతున్నారు.

ఫొటోలకు పోజులిచ్చిన మంత్రులు.. ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. ఆరు నెలల కింద ఊదరగొట్టే మాటలు మాట్లాడిన తండ్రీకొడుకులు.. మరునాడే పత్తా లేకుండా పోయారు. పేద బిడ్డలకు ఉన్నత విద్య అందించాలని వైయస్ఆర్ గారు ట్రిపుల్ ఐటీలను స్థాపిస్తే.. కేసీఆర్ మాత్రం ట్రిపుల్ ఐటీలపై నమ్మకమే లేకుండా చేస్తున్నారు.

వైఎస్సార్ హయాంలో ట్రిపుల్ ఐటీలో సీటు కోసం పోటీ పడిన విద్యార్థులు.. ఇప్పుడు సీటు కోసం అప్లై చేసుకోవడం కూడా మానేశారు. కేసీఆర్ దిక్కుమాలిన పాలన వల్ల పేద బిడ్డలకు ఉన్నత విద్య అందకపోగా.. ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ట్రిపుల్ ఐటీల్లో ఆత్మహత్యలపై దర్యాప్తు కమిటీని నియమించాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది. మరో విద్యార్థి ప్రాణం పోకముందే సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ” అని షర్మిల ట్వీట్ చేశారు.

Gudivada Amarnath : ప్రాజెక్టుల సందర్శన పేరుతో అల్లర్లకు చంద్రబాబు ప్లాన్.. పవన్ కు 10 ప్రశ్నలు సంధించిన గుడివాడ అమర్నాథ్