YS Sharmila Bonam : అమ్మవారికి బోనం సమర్పించకుండానే వెనుదిరిగిన షర్మిల

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అమ్మవారికి బోనం సమర్పించకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. బోనాన్ని వేరే మహిళకు అందించారు షర్మిల. ఆలయం వరకు వచ్చినా.. లోపలికి మాత్రం వెళ్లలేదు షర్మిల.

YS Sharmila Bonam : అమ్మవారికి బోనం సమర్పించకుండానే వెనుదిరిగిన షర్మిల

Ys Sharmila Bonam

YS Sharmila Bonam : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అమ్మవారికి బోనం సమర్పించకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. బోనాన్ని వేరే మహిళకు అందించారు షర్మిల. ఆలయం వరకు వచ్చి లోపలికి వెళ్లలేదు షర్మిల. ఆలయం వరకు బోనంతో వచ్చిన షర్మిల.. తన నెత్తి మీదున్న బోనాన్ని మరో భక్తురాలికి అందించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

వైఎస్ షర్మిల లాల్ దర్వాజ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆదివారం పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయం వరకు వచ్చారు షర్మిల. బంగారు బోనాన్ని నెత్తిన పెట్టుకుని ఆలయం వరకు వచ్చారు. కానీ, ఆలయంలోనికి మాత్రం వెళ్లలేదు. అమ్మవారిని దర్శించుకోలేదు. అంతేకాదు తన బోనాన్ని మరో మహిళకు ఇచ్చారు.

షర్మిల తీరు విమర్శలకు తావిచ్చింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచి తాను తెలంగాణ వాదిని, తెలంగాణ బిడ్డను అని షర్మిల చెప్పుకునే ప్రయత్నం చేశారు. తాను తెలంగాణ మహిళను, తెలంగాణ ఆడపడచుని అని గట్టిగా చెప్పుకొచ్చారు. కొన్ని రోజులుగా పాదయాత్ర చేస్తున్న షర్మిల తెలంగాణ ప్రజల సమస్యలపై తన గళం వినిపిస్తున్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.

PV Sindhu: లాల్‌ద‌ర్వాజా అమ్మ‌వారికి బంగారు బోనం స‌మ‌ర్పించిన పీవీ సింధు

తాను తెలంగాణ మహిళను, తెలంగాణ ఆడపడచుని అని చెప్పుకునే షర్మిల.. తెలంగాణ సంప్రదాయం విషయానికి వచ్చేసరికి కొంత పెడచెవిన పెట్టారనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో బోనాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, భక్తి భావంగా నిర్వహిస్తారు. బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడతాయి. అత్యంత వైభవంగా జరిగే ఆషాడ బోనాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది.

ప్రతి తెలంగాణ వాది కూడా ఆషాడంలో నిష్టగా పూజలు చేయడం, అమ్మవారిని దర్శించుకోవడం, బోనం సమర్పించడం వంటివి చేస్తారు. రాజకీయ నాయకులు సైతం అమ్మవారి దర్శనానికి తరలివస్తారు. బోనం సమర్పిస్తారు. ప్రతి రాజకీయ నేత సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడం, ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం చేస్తారు. అయితే, అందుకు విరుద్ధంగా షర్మిల వ్యవహరించారు. బోనం మరో మహిళకు ఇవ్వడం, ఆలయంలోనికి వెళ్లకపోవడం, అమ్మవారిని దర్శించుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది.