YS Sharmila : ఆఖరి గింజ వరకు కొనాలి..లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా : వైఎస్ షర్మిల

కేసీఆర్ కు మూడు వారాలు సమయం ఇస్తున్నాను..ఆఖరి గింజ వరకు కొనాలి...లేదంటే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హెచ్చరించారు.

YS Sharmila : ఆఖరి గింజ వరకు కొనాలి..లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా : వైఎస్ షర్మిల

Sharmila (1)

Updated On : November 13, 2021 / 8:32 PM IST

YS Sharmila criticized CM KCR : ఆఖరి గింజ వరకు కొంటానన్న కేసీఆర్ మాట నిలుపుకోవాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కేసీఆర్ కు మూడు వారాలు సమయం ఇస్తున్నాను..ఆఖరి గింజ వరకు కొనాలి…లేదంటే నిరాహార దీక్షకు కాదు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆమె రైతు వేదన నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష ముగింపు సంధర్భంగా షర్మిల మాట్లాడూతూ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం కేసీఆర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉందన్నారు. తమను ఆపడం ఎవరితరం కాదన్నారు.

Pawan Kalyan : ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఇచ్చిన జీవోలు రద్దు చేయాలి : పవన్ కళ్యాణ్

తనను చూస్తుంటే కేసీఆర్ కు ఎందుకంత ఉలికిపాటన్నారు. లోటస్ పాండ్ లో మిగిలిన రెండు రోజులు దీక్ష చేయాలని భావించా, కానీ పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. స్టేజ్ వేయనివ్వడం లేదు, వేసిన తీసేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణాలో పోలీసు జులుం నడుస్తుందన్నారు.

కేసీఆర్ కు ఆడవారి గండం ఉందని..అందుకే తనను ఆపాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తనను ఆపడం కేసీఆర్ తరం కాదని…ఇది వైఎస్సార్ రక్తం అన్నారు. హుజురాబాద్ ప్రజలు కేసీఆర్ చెంపచెళ్లుమనెలా తీర్పు ఇచ్చారు, త్వరలోనే రాష్ట్రమంతా కేసీఆర్ ను రాళ్లతో కొడుతారని స్పష్టం చేశారు.