Monkey Riding Goat: మేకపై పిల్ల కోతి సవారీ.. 130లక్షల మంది మనసు గెలిచిన వీడియో
ఇక్కడ మేక, కోతి పిల్ల మధ్య ఆధిపత్యం కనిపించడం లేదు. స్వచ్ఛమైన స్నేహమే కనిపిస్తోంది. తనపై అభిమానంతో తెచ్చిన పండ్లను స్నేహితుడైన కోతితో పంచుకునేందుకు పరిగెత్తుకొచ్చింది మేక.

Monkey Goat
Monkey Riding Goat: ఇక్కడ మేక, కోతి మధ్య ఆధిపత్య పోరు కనిపించడం లేదు. స్వచ్ఛమైన స్నేహమే కనిపిస్తోంది. తనపై అభిమానంతో తెచ్చిన పండ్లను స్నేహితుడైన కోతితో పంచుకునేందుకు పరిగెత్తుకొచ్చింది మేక. అది కూడా కోతిని ఎక్కించుకుని అక్కడకు తీసుకొచ్చింది.
చేతిలో బెర్రీ పండ్లను వేసుకుని మేకను పిలిచిన వ్యక్తి మెడలో కోతిని వేలాడేసుకుంటూ వస్తున్న మేకను చూసి ఆశ్చర్యపోయాడు. అతని చేతుల్లో ఉన్న బెర్రీ పండ్లను మేక నోటికి అందించాడు. అంతే ప్రేమగా వాటిని తీసుకుని తింటున్న మేకను చూసి కోతి ముందు కన్ఫ్యూజ్ అయింది. కాసేపటి తర్వాత తాను కూడా ఆ ట్రీట్ లో జాయిన్ అయ్యింది. తాను కూడా ఓ బెర్రీ పండును తీసుకుని మేకపైకి ఎక్కి కూర్చొంది.
వేలాడుతూ తినలేమని తెలుసుకుని పైకి ఎక్కి తినేపనిలో నిమగ్నమైంది. రెండు సాధు జంతువుల మధ్య స్నేహానికి.. అవి అంత చొరవగా మనిషి నుంచి బెర్రీలు తీసుకుని తినడం చూసి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
………………………………..: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు డేవిడ్ వార్నర్ గుడ్‌బై
వీడియో పోస్టు చేసిన ఒక్క రోజులో 13మిలియన్ వ్యూస్ దక్కించుకోవడంతో పాటు 5లక్షల 34వేల లైకులు దక్కించుకుంది. పైగా దీనిని లక్షా 5సార్లు రీట్వీట్ చేశారు.
Am I high right now what is happening pic.twitter.com/itBaV1XUNK
— Kristi Yamaguccimane (@wapplehouse) September 26, 2021