Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి, బరువును తగ్గించే సూపర్ డ్రింక్!

ఆరోగ్యానికి హానికలిగించే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవటానికి నిమ్మ, దాల్చిన చెక్కతో తయారు చేసే సూపర్ డ్రింక్ బాగా ఉపకరిస్తుంది. ఈ డ్రింక్ ను చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి, బరువును తగ్గించే సూపర్ డ్రింక్!
ad

Bad Cholesterol : ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, శరీరానికి శ్రమ లేకపోవడం, ధూమపానం, మద్యపానం వంటి రకరకాల కారణాల వల్ల రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోవటంతోపాటు అధిక బరువు సమస్య తలెత్తుతుంది. చిన్న, పెద్ద అనే తేడానే లేకుండా అందరు ఈ సమస్యల బారిన పడుతున్నారు. దీంతో వారు అనారోగ్యం పాలవుతున్నారు. వ్యాయామం చేయక పోవడం, గంటల తరబడి ఒకే చోట పని చేయడం వంటివి అధిక బరువు సమస్యను తెచ్చిపెడుతున్నాయి.

బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే కొద్ది గుండెకు ముప్పు పెరుగుతుంది. శరీరంలోని జీర్ణక్రియ చాలా బలహీనంగా మారుతుంది. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తుతాయి. బీపీ పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో స్ట్రోక్ కు దారి తీస్తుంది. చేతులు, కాళ్లల్లో నొప్పి వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఇలాంటి లక్షణాలన్నీ శరీరంలో చెడు కొవ్వులు పేరుకుపోవటం వల్లే కలిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యానికి హానికలిగించే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవటానికి నిమ్మ, దాల్చిన చెక్కతో తయారు చేసే సూపర్ డ్రింక్ బాగా ఉపకరిస్తుంది. ఈ డ్రింక్ ను చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా పొయ్యిపై గిన్నెలో నీరు పోసి బాగా మరిగిస్తుండాలి. ఆనీటిలో టేబుల్ స్పూన్ అల్లం తరుగు, టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు, నాలుగైదు నిమ్మపండు ముక్కలు, అర అంగుళం దాల్చిన చెక్క వేసుకుని పదిహేను నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఇలా మరిగించిన వాటిని కాస్త చల్లారక బ్లెండర్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వడకట్టుకుని రుచికోసం తేనెను కలుపుకుని తాగాలి.

ఉదయం సమయంలో ఈ డ్రింక్‌ను తీసుకుంటే రక్తంలో పేరుకు పోయిన చెడు కొలస్ట్రాల్ మొత్తం క్రమంగా కరిగి గుండె ఆరోగ్యంగా మారుతుంది. అలాగే ఈ డ్రింక్‌ను డైట్‌లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గటానికి అవకాశం ఉంటుంది. శరీరంలో వ్యాధినిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. చిన్నచిన్న అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఈ జ్యూస్ దోహదపడుతుంది.